AP CM Jagan: సీఎం పర్యటన.. అధికారుల ఓవరాక్షన్‌.. అద్దె కారులో తిరుపతి వెళ్తున్న ఫ్యామిలీకి చుక్కలు..

AP CM Jagan: ఒంగోలులో (Ongole) RTO అధికారులు ఓవరాక్షన్‌ చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రంతా బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన..

AP CM Jagan: సీఎం పర్యటన.. అధికారుల ఓవరాక్షన్‌.. అద్దె కారులో తిరుపతి వెళ్తున్న ఫ్యామిలీకి చుక్కలు..
Onglore Tirumala Devotees
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2022 | 8:14 AM

AP CM Jagan: ఒంగోలులో (Ongole) RTO అధికారులు ఓవరాక్షన్‌ చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రంతా బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వినుకొండ(Vinukonda) నుంచి తిరుమలకు(Tirumala) రెంట్‌ కారులో బయలుదేరింది శ్రీనివాస రావు కుటుంబం. టిఫిన్ చేసేందుకు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ దగ్గర ఆగారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న రవాణా శాఖ అధికారులు సీఎం టూర్‌కు కార్లు కావాలంటూ.. బలవంతంగా ఆ కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే తాము కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్నామని… కారును ఇవ్వమని అధికారులను శ్రీనివాసరావు ఫ్యామిలీ ఎంత వేడుకున్నా కనికరించలేదు. కారు ఇచ్చేది లేదంటూ కావాలంటే బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇక చేసేది ఏమి లేక.. బస్టాండ్‌కు చేరుకొని వినుకొండ నుంచి మరో రెంట్‌లో తిరుమలకు వెళ్లారు. అయితే రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన కోసమంటూ రోడ్లపై దూర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను ఆపి ఆధీనంలోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు.

వినుకొండ నుంచి తిరుమలకు వెళ్తున్న కుటుంబంనుంచి సీఎం కాన్వాయ్ కోసం ఇన్నోవా వాహనాన్ని అధికారులు తీసుకున్నారు. ఒంగోలులో నడిరోడ్డుపై కుటుంబాన్ని దించి వేశారు. ఈ సంఘటన సీఎం కార్యాలయం దృష్టికి వెళ్ళింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలకు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ రేపటి ఒంగోలు పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌కోసం వాహనాలు సమకూర్చాలంటూ సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తాకథనాలు సీఎం దృష్టికి చేరుకున్నాయి. దీంతో సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని చెప్పారు.

Also Read: 

Anakapalli: పుష్ప.. ఇంతటి దారుణానికి పాల్పడింది అందుకేనంటా..! అబ్బాయి సమక్షంలోనే కత్తిని కొని..

Tamil Nadu: రీల్ సీన్ కాదు రియల్ సీనే.. ప్రేమ మైకంలో పురుషుడిగా మారిన మహిళ.. కట్ చేస్తే