AP Crime: మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మృత్యువు

వారి ఆనందం క్షణకాలమైనా నిలవలేదు. రోడ్డు ప్రమాదం(Accident) రూపంలో మృత్యువు కబళించింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు సంతోషంగా బైక్ పై బయల్దేరారు ఆ ముగ్గురూ. తమ మిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.....

AP Crime: మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మృత్యువు
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 21, 2022 | 6:29 AM

వారి ఆనందం క్షణకాలమైనా నిలవలేదు. రోడ్డు ప్రమాదం(Accident) రూపంలో మృత్యువు కబళించింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు సంతోషంగా బైక్ పై బయల్దేరారు ఆ ముగ్గురూ. తమ మిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. కడప(Kadapa) జిల్లా లింగాల మండలంలోని కామసముద్రం గ్రామానికి చెందిన రాహుల్‌కుమార్‌రెడ్డి.. పులివెందుల మండలానికి చెందిన తన స్నేహితులైన గోవర్ధన్ రెడ్డి, చరణ్‌రెడ్డితో కలిసి పులివెందుల పట్టణంలోని మిత్రుడి పుట్టిన రోజు కార్యక్రమానికి బైక్ పై బయల్దేరారు. వేడుకల అనంతరం రాహుల్‌కుమార్‌రెడ్డిని అతడి స్వగ్రామంలో దిగబట్టేందుకు ముగ్గురూ బైక్ వెళ్తున్నారు. అదే సమయంలో పులివెందుల(Pulivendula) మారుతీబజార్‌కు చెందిన కె.మహబూబ్‌బాషా లింగాల నుంచి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్నారు.

చిన్నకుడాల విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో చేరుకోగానే రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో రాహుల్‌కుమార్‌రెడ్డి, గోవర్ధనరెడ్డి, మహబూబ్‌బాషా అక్కడిక్కడే మృతి చెందారు. చరణ్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

Also Read

Pranahita Pushkaralu: వైభవంగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలు.. భక్త జనసంద్రమైన పుష్కర ఘాట్లు..

Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు

Delhi Demolition: హీట్ పెంచిన బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌.. ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారి దుకాణాలను కూల్చేయడంపై దుమారం..