Delhi Demolition: హీట్ పెంచిన బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌.. ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారి దుకాణాలను కూల్చేయడంపై దుమారం..

దేశంలో బుల్‌డోజర్‌(Bulldozers) పాలిటిక్స్‌ మరింత ఊపందుకున్నాయి. ఢిల్లీలోని జహంగిర్‌ పురిలో(Jahangirpuri) అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లు, దుకాణాలను కూల్చేయడంపై దుమారం రేపింది. అయితే కూల్చివేతలపై..

Delhi Demolition: హీట్ పెంచిన బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌.. ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారి దుకాణాలను కూల్చేయడంపై దుమారం..
Delhi Demolition
Follow us

|

Updated on: Apr 20, 2022 | 8:36 PM

దేశంలో బుల్‌డోజర్‌(Bulldozers) పాలిటిక్స్‌ మరింత ఊపందుకున్నాయి. ఢిల్లీలోని జహంగిర్‌ పురిలో(Jahangirpuri) అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లు, దుకాణాలను కూల్చేయడంపై దుమారం రేపింది. అయితే కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇవన్నీ ఆక్రమణలన్నీ, వాటిని తొలగిస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన డ్రైవ్‌పై సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు(Supreme Court ) ఆదేశాలు ఇచ్చిన గంటన్నర తర్వాత ఈ కూల్చివేతలు ఆగిపోయాయి. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ కూల్చివేతలను- రాజ్యాంగ విలువల కూల్చివేతతో పోల్చారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. పేదలు, మైనారిటీలను టార్గెట్‌ చేస్తూ- ప్రభుత్వ ప్రేరేపిత చర్యలుగా అభివర్ణించారు. ఇలా కూల్చివేతలకు పాల్పడేబదులు- బీజేపీ నేతలు తమ హృదయాల్లో విద్వేషాన్ని కూల్చేయాలన్నారు రాహుల్‌గాంధీ. మరోవైపు CPM నేత బృందా కారత్‌ బుల్డోజర్లను అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రతులను చూపించారు. ప్రజలు సంయమనం పాటించాలని బృందా కారత్‌ కోరారు.

పోలీసుల కూల్చివేతలపై ఢిల్లీలో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ మంజూరుచేసిన దుకాణాన్నే పోలీసులు కూల్చివేశారనీ గణేష్‌కుమార్‌ గుప్తా అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. తాము దాడులు చేయకపోయినా, తమ దుకాణాన్ని తొలగించారన్నారు. మరోవైపు తన కళ్లముందే తన ఇంటిని కూల్చేస్తుంటే, ఒక పేద మహిళ విలపించింది. తన గూడును బుల్డోజర్‌ ధ్వంసం చేస్తూ ఆపడానికి ఆమె విఫలయత్నం చేసింది.

సుప్రీంకోర్ట్‌ స్టే విధించినా కూల్చివేతలు కొనసాగాయని CJI జస్టిస్‌ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే. దీనిపై స్పందించిన CJI జస్టిస్‌ ఎన్వీ రమణ..స్టేటస్‌ కో ఆర్డర్‌ను నార్త్‌ ఢిల్లీ మేయర్‌, NDMC కమిషనర్‌, ఢిల్లీ పోలీసులకు తెలియజేయాలని సుప్రీం రిజిస్ట్రీని ఆదేశించారు.

మరోవైపు జహంగీర్‌పురీలో పర్యటించారు సీపీఎం నేతలు. కోర్టు ఉత్తర్వులను అమలుచేసేందుకే అక్కడికొచ్చినట్టు తెలిపారు. చట్టవిరుద్ధమైన కూల్చివేతలతో రాజ్యాంగాన్ని బుల్డోజర్‌ చేశారు. కనీసం సుప్రీంకోర్టును, దాని ఆదేశాలను బుల్డోజర్‌ చేయొద్దని కోరారు సీపీఎం నేత బృందాకారత్‌. జహంగీర్‌పురి కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..జమైత్‌ ఉలమా ఏ హింద్‌ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు మొదలుపెట్టారని వాదనలు వినిపించారు పిటిషనర్‌ తరపు లాయర్‌. ఐతే కేసు విచారణ గురువారం చేపడుతామన్న యధాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

Latest Articles