Pranahita Pushkaralu: వైభవంగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలు.. భక్త జనసంద్రమైన పుష్కర ఘాట్లు..
Pranahita Pushkaralu: గోదావరి(Goadavari) నదికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రకృతి రమణీయతలో పక్షుల కిలకిలలు. గోదావమ్మ సెలయేర్లు...
Pranahita Pushkaralu: గోదావరి(Goadavari) నదికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రకృతి రమణీయతలో పక్షుల కిలకిలలు. గోదావమ్మ సెలయేర్లు… ప్రణీత పరవళ్లు… సరస్వతి దీవెనలతో భక్తజనం మురిసిపోతుంది. ప్రవాహ పుష్కరుడిలో ముక్కోటి దేవతలు కొలువుదీరగా… ముక్కంటి సన్నిధిలో పుష్కర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పుష్కర సంరంభం తొమ్మిదో రోజుకు చేరుకోగా దారులన్ని పుష్కర ఘాట్ కు చేరుకుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పుష్కరోత్సవానికు కదలివస్తున్నారు. గత పుష్కరాల పుణ్యస్నానాలను పయనం చేసుకుంటూ ప్రణీత పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాళేశ్వర త్రివేణి సంగమ తీరం, మహారాష్ట్రలోని నగరం, సిరొంచ పుష్కర ఘాట్లు భక్త జనసంద్రమైంది.
భక్తులు పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు చేసి దానాలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ విధితో పాటు మహిళలు వాయినాలు ఇచ్చిపుచుకున్నారు. సైకత లింగాల పూజ, దంపతి స్నానాలు, అర్హ్య ప్రదానం చేస్తూ నది మాతను స్మరించారు. కాళేశ్వర క్షేత్రం చేరుకొని మనసాస్మరామి అంటూ దేవదేవుని సన్నిధిలో మొక్కులు చెల్లించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లకు అభిషేకాలు, సరస్వతి నమస్తుభ్యం అంటూ కొలిచారు.
Also Read:Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలివే..