Andhra Pradesh: అట్లుంటది రాధిక మనతోని.. ఏటీఎం చోరీకి వచ్చిన దొంగ.. కట్ చేస్తే కళ్లు చెదిరే సీన్..
మనకు తెలిసిన పని ఎంతైనా చేయాలి.. అదే మనకు తెలియని పని అయితే.. అస్సలు వేలు పెట్టకూడదు. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే..
మనకు తెలిసిన పని ఎంతైనా చేయాలి.. అదే మనకు తెలియని పని అయితే.. అస్సలు వేలు పెట్టకూడదు. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే.. సాధారణంగా పరీక్షల్లో ప్రశ్నకు జవాబు తెలిసినోళ్ళు ఏం చేస్తారు.? దిక్కులు చూడకుండా ఠక్కున రాసేస్తుంటారు. ఇట్లానే మనకు తెలిసిన పనైతే.. గబగబా చేసుకుని పోతుంటాం. అదే తెల్వని పనైతే.. ఎట్లారా నాయనా అని తల పట్టుకుంటాం. అందుకే దేనిలోనైనా ట్రైనింగ్ ఉండాలంటారు పెద్దలు. లేకపోతే ఇదిగో గిట్లా ఏటీఎంలోకి వచ్చిన దొంగ లెక్క అవుతుంది కథ.
ఏందిరా! అంతా ఇట్లా ఉంది.? దీనిని కోసేది ఎట్లా.? మొదలు పెట్టేది యెట్లా.? అసలు పైసలు ఎక్కడున్నాయి. కనిపించట్లేదే.? పక్కది కూడా ఇలానే ఉందా.. అసలేం అర్ధం కావట్లేదే.. ఏడ నుంచి తీసుకొచ్చి పెడతార్రా ఇలాంటి పెద్ద పెద్ద మిషిన్లు.. అసలు పక్క మిషిన్ ఎలా ఉందొ సూద్దాం పదా.!
చూశారా.! ఈ దొంగ ఒకటి కాదు అక్కడున్న రెండు మిషిన్ల నట్లు, బొట్లు మొత్తం ఊడదీసి.. అసలు ఎక్కడున్నాయిరా పైసలు అంటూ వెతుకుతున్నాడు. బటన్ నొక్కగానే అందరికీ జల్దీ పైసలు వస్తాయే.. మరి నాకేంటి అస్సలు దొరకట్లేదు. అనుకుంటూ చివరికి ఈరోజు నా గడియ మంచిగా లేనట్లు ఉందనుకుని ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోతాడు ఈ దొంగ. అనంతపురం జిల్లా మెయిన్ రోడ్డులో ఉన్న ఏటిఎంలో నాలుగు రోజుల క్రితం ఓ దొంగ పడిన అవస్థలు ఇవి. ఇనుపచువ్వతో ఏటీఎం డోర్ తెరిచి.. పైసల కోసం ప్రయత్నించిన ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా నగదు బాక్స్ తెరుచుకోకపోవడంతో ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లిపోయాడు. మనోడిని చూస్తుంటే.. దొంగతనంలో ఎక్స్‌పీరియన్స్ లేనట్లు ఉంది.. అట్లుంటది రాధిక మనతోని.. అనుకుంటూ ఖాళీ చేతులతో చివరికి ఏటీఎం బయటికి వచ్చాడు.