AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: రీల్ సీన్ కాదు రియల్ సీనే.. ప్రేమ మైకంలో పురుషుడిగా మారిన మహిళ.. కట్ చేస్తే

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ ఏర్పడడం సర్వసాధారణం. అలా కాకుండా ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ(Love) కలిగితే.. లేదా ఇద్దరు మహిళల మధ్య ప్రేమ పుడితే.. ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూసుంటాం. ఎలాగైనా పెళ్లి...

Tamil Nadu: రీల్ సీన్ కాదు రియల్ సీనే.. ప్రేమ మైకంలో పురుషుడిగా మారిన మహిళ.. కట్ చేస్తే
Love Cheating
Ganesh Mudavath
|

Updated on: Apr 21, 2022 | 6:55 AM

Share

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ ఏర్పడడం సర్వసాధారణం. అలా కాకుండా ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ(Love) కలిగితే.. లేదా ఇద్దరు మహిళల మధ్య ప్రేమ పుడితే.. ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూసుంటాం. ఎలాగైనా పెళ్లి చేసుకునేందుకు వారిలో ఎవరో ఒకరు లింగభేదం చెందడం కూడా చూశాం. ఇదంతా కేవలం కామెడీ కోసం చేసిందే అయినా.. అలాంటి ఘటనలే వాస్తవ జీవితంలోనూ చోటు చేసుకుంటున్నాయి. ప్రేమలో నిండా మునిగిన ఇద్దరు మహిళల్లో ఒకరు పురుషుడిగా మారాడు. తీరా చూస్తే.. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ సదరు మహిళ చెప్పడం విస్మయానికి గురి చేసంది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించాడు. తమిళనాడు(Tamil Nadu) మదురై జిల్లాలోని విల్లాపురం మీనాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన జయసుధకు.. ఉమచ్చికులం ప్రాంతానికి చెందిన సెంథిలతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జయసుధపై పురుషుడిగా మారాలని సెంథిల ఒత్తిడి చేసింది. 2021 మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని, తన పేరును ఆదిశివ మార్చుకుంది.

అనంతరం వీరిద్దరూ ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. వారు ఈ ఘటనపై తిరుప్పరకుండ్రం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పడంతో జయనుధ కంగుతింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పురుషుడిగా మార్చిన సెంథిలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు బుధవారం వినతిపత్రం అందజేసింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

Also Read

Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై గర్జిస్తున్న రష్యన్‌ క్షిపణులు.. మరియుపోల్‌లో ఇరు సేనల వీధి పోరాటాలు..

Delhi Demolition: హీట్ పెంచిన బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌.. ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారి దుకాణాలను కూల్చేయడంపై దుమారం..