Chintha Chiguru: మటన్‌తో పోటీ.. చిటారు కొమ్మన చింత చిగురు ధర

‘చింతే’కదా అని తీసిపారేయకండి.. ఇప్పుడా చింత చిగురే కొందరికి కాసులు కురిపిస్తుంది. పట్టణాలు, నగరాల్లోని మార్కెట్‌లో కిలో ధర ఏకంగా రూ.600 పలుకుతూ మటన్‌ రేటుతో పోటీ పడుతుంది. పల్లెల్లో దీనికి అంత సీన్‌ లేకున్నా పట్టణాల్లో మాత్రం అత్యంత ఖరీదైన కూరగా మారింది.

Chintha Chiguru:  మటన్‌తో పోటీ.. చిటారు కొమ్మన చింత చిగురు ధర
Chintha Chiguru
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 26, 2024 | 5:07 PM

వేసవి కాలం చివరి రోజుల్లో చింత చెట్లకు ఉన్న ఆకు రాలిపోయి కొత్త గా చిగురు వస్తుంది. దీన్ని కూరల్లో, పప్పులో వేసి తింటారు. కొంతమంది చిగురు ఇగురు కూడా చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. సీజనల్ అయిన చిగురు ఎప్పుడు వస్తుందా అని గ్రామాల్లో జనాలు ఎదురు చూస్తుంటారు. సిటీలో జనాలు కూడా చింత చిగురు డిష్‌లు తినేందుకు ఆసక్తి చూపిస్తుండంతో దాని రేటు బాగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో చింత చెట్లు అంతరించిపోవడంతో .. చిగురు కోసం నానా పాట్లు పడుతున్నారు చింత చిగురు ప్రియులు. ఇటీవల కురిసిన వర్షాలకు చింత చెట్లకు లేత ఆకులు చిగురించాయి. దాంతో రుచి చూడాలని చింత చిగురు కోసేందుకు చిన్నా పెద్ద తరలివస్తున్నారు. చింత చిరుగు కోసేందకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు చెట్లు ఎక్కి, మరి కొందరు ఒకరి భుజాలపై మరొకర్ని ఎక్కించుకుని చిగురు అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళల సైతం చెట్లు ఎక్కి చింత చిగురు కోసే ప్రయత్నం చేస్తున్నారు.

గత సంవత్సరం చిగురు కేజీ 400 రూపాయలు ఉంటే ఇపుడు ఏకంగా మటన్ రేటుతో పోటీ పడుతూ కేజీ 600 రూపాయలు పైనే పలుకుతోంది. దీన్ని బిజినెస్ చేసుకుంటున్నారు కొందరు. గ్రామాల్లో చింత చిగురు సేకరించుకొని పట్టణాల్లో కేజీ 600 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుండటంతో చింత చిగురు రుచి మటన్ రేటుతో పోటీ పడుతుంది. పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా గ్రామాల నుంచి చిగురు తీసుకొచ్చి అమ్మేవాళ్లే కనిపిస్తున్నారు. పుల్ల పుల్లగా ఉండే చిగురు టేస్ట్ ఒక్కసారైనా చూడాలనుకునేవారికి వంద గ్రాములు 60 రూపాయల లెక్ అమ్ముతున్నారు. వినియోగదారులేమో.. వామ్మో ఇంత రేటా అని వాపోతున్నారు. చింత చిగురు చెట్టు కూడా పెద్దగా లేవు.. అలానే సేకరించడం చాలా కష్టం.. అందుకే ఇంత రేటు అంటున్నారు చిగురు అమ్మేవారు.

Latest Articles