Telangana: ఆలయం ముందు పోలీసుల గస్తీ.. దొంగల భయమో, వీఐపీలు వస్తున్నారనో కాదు..
ఒకప్పుడు రాజ్యాధికారం, ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాల్లో రాజ్యాలే కూలిపోయాయి. ఇప్పుడు ఆధిపత్య రాజకీయలతో గ్రామాలే అట్టుడికి పోతున్నాయి. ఈ రాజకీయ సెగ సామాన్యులకే కాదు.. ఆ గ్రామ ఇలవేల్పైన దేవుడికి కూడా తప్పడం లేదు. రాజకీయ వైరుధ్యాలతో గ్రామంలోని ఆలయానికి తాళం వేశారు. ఆ దేవుడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల నిర్వహణ సందిగ్ధంలో పడిం

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ ప్రజలకు ఇలవేల్పుగా ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఆలయ ధర్మకర్త మూల రాజు, గ్రామస్తుల మధ్య వారం రోజులుగా వివాదం నెలకొంది. దీంతో రెండు రోజుల నుంచి ఆలయంలో పూజ కైంకర్యాలు నిర్వహించడం లేదు. దీంతో ఈ నెల 13వ తేదీ నుంచి 15వరకు జరగాల్సిన బ్రహ్మోత్సవాలు వాయిదా పడ్డాయి. 23 ఏళ్లుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా తానే నిర్వహిస్తున్నానని ధర్మకర్త మూల రాజు వాదిస్తున్నారు. ధర్మకర్త రాజు ఒంటెద్దు పోకడతో తమను విస్మరిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు మరో తేదీ ఖరారు చేసి నిర్వహించాలని గ్రామస్తులు పట్టుపట్టారు. ఈ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలు చర్చించుకోవాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి తేదీలను ఖరారు చేసుకోవాలని పోలీసులు చెప్పారు. రెండు రోజులుగా ఆలయం వద్ద పోలీసులు పహారా కాశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో మూలరాజు తమపై చిన్నచూపు చూడడంతో వివాదం నెలకొందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామస్థుల సమష్టి నిర్ణయంతో అందరూ కలిసి సమయం తీసుకొని తేదీ ఖరారు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఆలయ ధర్మకర్త గ్రామస్తులు సామరస్యంగా చర్చించుకుని బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారా లేదా అన్నది ఇప్పుడు స్థానికంగా బిగ్ టాపిక్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.