Vivek Girreddy Amazon: మరో తెలుగు యువకుడు యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 28 ఏళ్ల వయసులోనే ఏకంగా రూ. కోటిన్నర వార్షిక వేతనాన్ని సాధించింది సత్తా చాటాడు. ప్రముఖ అంతర్జాతీయ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమేజాన్ రూ. కోటిన్నర వార్షిక వేతనంతో తెలుగు కుర్రాడిని నియమించుకుంది.
వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల వివేక్ గిర్రెడ్డి అనే కుర్రాడు ముంబయిలోని డాన్‌బాస్కో స్కూల్‌లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడు. వివేక్ తండ్రి సూర్యనారాయణరెడ్డి, తల్లి భానురెడ్డి. కాకినాడకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముంబయిలో చదువు పూర్తయ్యాక వివేక్.. ‘ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్’లో బీఏ చదివేందుకు మొదట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరాడు. తొలి ఏడాది పూర్తయిన తర్వాత కెనడా మాంట్రియల్‌లోని మెక్‌గిల్ వర్సిటీకి తన అడ్మిషన్ బదిలీ చేసుకుని అక్కడ మూడేళ్ల పాటు చదివి డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా అట్లాంటాలోని జార్జ్‌టెక్ వర్సిటీలో ఎంబీఏలో చేరాడు. అయితే ఇంకా ఎంబీఏ పూర్తిచేయకుండానే వివేక్‌కు ఈ ఆఫర్ వరించింది. వివేక్ వచ్చే నెలలో తన ఎంబీఏను పూర్తి చేయనుండగా.. ఇటీవల అమేజాన్ నిర్వహించిన ‘ఫైనాన్షియల్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ కింద ‘సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్’గా ఎంపికయ్యాడు.
Also Read: Drinking Water in the Morning: ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..!
Hyderabad Crime: మానవత్వమా నీవెక్కడ..? బాలుడి శరీరంపై సలసలా కాగే నీటిని పోసిన పెద్దనాన్న