Hyderabad Crime: మానవత్వమా నీవెక్కడ..? బాలుడి శరీరంపై సలసలా కాగే నీటిని పోసిన పెద్దనాన్న

మానవత్వమా నీ అడ్రస్‌ ఎక్కడ అంటే.. చెప్పలేని పరిస్థితులు ప్రస్తుత కాలంలో నెలకొన్నాయి. అన్నాదమ్ములు, తండ్రీ కొడుకులు, అక్కా చెల్లెళ్లు.. ఆఖరికి తల్లిని కూడా పట్టించుకోలేని దుస్థితి ఉంది.

Hyderabad Crime: మానవత్వమా నీవెక్కడ..? బాలుడి శరీరంపై సలసలా కాగే నీటిని పోసిన పెద్దనాన్న
Step Father Harassed
Follow us

|

Updated on: Apr 17, 2021 | 7:23 AM

మానవత్వమా నీ అడ్రస్‌ ఎక్కడ అంటే.. చెప్పలేని పరిస్థితులు ప్రస్తుత కాలంలో నెలకొన్నాయి. అన్నాదమ్ములు, తండ్రీ కొడుకులు, అక్కా చెల్లెళ్లు.. ఆఖరికి తల్లిని కూడా పట్టించుకోలేని దుస్థితి ఉంది. ఇలాంటి ఘటనే జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో చోటుచేసుకుంది. తన సొంత తమ్ముడి కొడుకుకి టార్చర్‌ చూపించాడో పెద్దనాన్న. ఆరేళ్లున్న ఆ బాలుడి శరీరంపై సలసలా కాగే నీటిని పోసి పైశాచికానందాన్ని పొందాడు. బాలుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరేళ్ల బాలుడు నాగేంద్రకు మూడేళ్ల వయసు ఉన్నపుడే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి అతడి భారాన్ని మోయలేక.. బాబుని అతడి పెద్దనాన్న దగ్గరే వదిలి వెళ్లిపోయింది.

బాలుడి పెద్దనాన్న రాజు మాత్రం ఏ రోజూ అతడిని సరిగా చూసుకోలేదు. మూడేళ్ల నుంచి అతడిని చిన్నారిని దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తూ వస్తున్నాడు. రోజూ కొట్టేవాడు.. బూతులు తిట్టేవాడు. చిన్న వయసులోనే ఎన్నో అవమానాలు భరిస్తూనే పెదనాన్న రాజు దగ్గర ఉంటూ వస్తున్నాడు నాగేంద్ర. తాజాగా రాజు… నాగేంద్రపై వేడినీళ్ళు పోయడంతో.. ఒళ్లు కాలిపోయింది. అనేక చోట్ల గాయాలయ్యాయి. బాలుడి ఆర్తనాదాలతో.. చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు బాలుడి పెదనాన్న రాజుని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించారు. బాలుడికి చిన్న చిన్న లోపాలు ఉండడం.. సరైన ఎదుగుదల లేకపోవడంతోనే అతడి పెద్దనాన్న ఇలా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

Also Read: సెగలు పుట్టిస్తోన్న సెకండ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కరోనా కలవరం.. తాజా పరిస్థితి ఇది..

ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు