ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు

ఏపీలో రెండు నెలల పాటు చేపల వేటను బ్యాన్‌ చేసింది ప్రభుత్వం. చేపల పునరుత్పత్తి సమయం కావడంతో.. బ్యాన్ అమలులోకి వచ్చింది. అయితే....

ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు
Fishing Ban In Ap
Follow us

|

Updated on: Apr 17, 2021 | 6:57 AM

ఏపీలో రెండు నెలల పాటు చేపల వేటను బ్యాన్‌ చేసింది ప్రభుత్వం. చేపల పునరుత్పత్తి సమయం కావడంతో.. బ్యాన్ అమలులోకి వచ్చింది. అయితే చేపల వేటే ఆధారంగా బతుకుతున్న కుటుంబాలకు ఈ రెండు నెలల పాటు ఉపాధి ఆగిపోయింది. ఈ సమయంలో సముద్రంలో వేట కోసం ఎటువంటి బోట్లు అనుమతించరు. తొలుత మోటార్‌ బోట్లపై మాత్రమే నిషేధం పెట్టినప్పటికీ, ప్రస్తుతం నాటు పడవలలో వెళ్లి వేటాడటాన్ని కూడా నిషేధించారు. గతంలో నెల రోజులే ఉండే ఈ నిషేధాన్ని క్రమంగా పెంచారు. జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ సమయాల్లో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే ఉద్దేశంతో వేటకు విరామాన్ని ప్రకటిస్తూ వస్తోంది.

చేపల వేటకు దూరంగా ఉంటున్న మత్స్యకారులకు ప్రభుత్వం పది వేల రూపాయల భృతి ఇస్తోంది. ఈ సారి కూడా పరిహారం చెల్లింపుకు చర్యలు చేపట్టింది. ఈనెల 19న మత్స్యశాఖ అధికారులు సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఈనెల 25న గ్రామ సచివాలయాల్లో అర్హులైన జాబితా ప్రకటించి, మే 18న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేట నిషేధ భృతిని 2018 వరకు మోటారు బోట్లకు పరిమితం చేయగా.. గతేడాది నుంచి తెప్పలపై చేపల వేట సాగిస్తున్న వారికీ ఆర్ధికసాయం చేస్తోంది. ఒక్కో మోటారు బోటుకు ఆరుగురు, తెప్పకు ముగ్గురు చొప్పున పరిహారం చెల్లిస్తోంది. రిజిస్ట్రేషన్‌ అయిన బోట్లకే పరిహారం చెల్లిస్తున్నారు అధికారులు. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. పదివేల రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు మత్స్యకారులు. ప్రభుత్వం పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. వయోపరిమితి కూడా ఎత్తేయాలంటున్నారు.

Also Read:  ప్రముఖ కమెడియన్ ‘వివేక్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ

సెగలు పుట్టిస్తోన్న సెకండ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కరోనా కలవరం.. తాజా పరిస్థితి ఇది..