Petrol, Diesel Price Today: స్థిరంగానే చమురు ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Petrol, Diesel Rates Today: భారత్‌లో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. ఇటీవల భారీగా పెరిగిన చమురు ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్

Petrol, Diesel Price Today: స్థిరంగానే చమురు ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Fuel Rates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 17, 2021 | 6:58 AM

Petrol, Diesel Rates Today: భారత్‌లో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. ఇటీవల భారీగా పెరిగిన చమురు ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ మరోవైపు గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు యజమానులు భయపడ్డారు. దీంతో ఓ వైపు ప్రజలు, మరోవైపు విపక్షపార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తంచేశాయి. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75గా ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62, డీజిల్‌ ధర రూ.83.61 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు .. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.93.87 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.93 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.68 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.17 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.95.36 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.03గా ఉంది.

Also Read:

Covid-19 Vaccine: ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి.. అమెరికాను కోరిన ‘సీరం’ సీఈఓ అదర్‌ పూనావాలా

పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..