Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…?

Fixed Deposit: ప్రస్తుత కాలంలో బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు తిరిగి చెల్లిస్తారో లేదో అనే బెంగ ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏం వస్తాయి అని భావించే వాళ్లు స్థిర

Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి...?
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2021 | 8:40 AM

Fixed Deposit: ప్రస్తుత కాలంలో బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు తిరిగి చెల్లిస్తారో లేదో అనే బెంగ ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏం వస్తాయి అని భావించే వాళ్లు స్థిర డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. కొన్ని బ్యాంకులలో ఎక్కువ వడ్డీ వస్తుంది. మరి కొన్ని బ్యాంకులలో తక్కువ వడ్డీ వస్తుంటుంది. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడి, మూలధనం భద్రతకు హామీ ఇస్తుంది. అయినప్పటికీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. కొన్ని బ్యాంకులు కస్టమర్ల కోరిక మేరకు ఎఫ్‌డీలపై టీడీఎస్‌ను కొంత వరకు తగ్గిస్తాయి. బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…? అనే విషయాలను తెలుసుకుందాం.

ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు సంపాదించిన వడ్డీపై టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. వివిధ ఎఫ్‌డీలపై బ్యాంకులు 10 శాతం చొప్పున టీడీఎస్‌ను తగ్గించుకొంటాయి. అయితే ఖాతాదారుడు పాన్‌కార్డు నెంబర్‌ జత చేసిన తర్వాత అతనికి ట్యాక్స్‌లో రాయితీ కల్పిస్తారు. ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని బ్యాంకుకు తెలియజేయాలి. ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సెల్స్‌ డిక్లరేషన్‌ ఫారాలు. దీనిలో మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని తగిన ఆధారాలు సమర్పించాలి. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

60 ఏళ్ల వయసు పైబడిన వారు, 80 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్‌ను నివారించడానికి మీరు ఇప్పుడు ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల టీడీఎస్‌ను తగ్గించుకోవచ్చు.

ఇవీ చదవండి: Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!

SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు… ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..