Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు… ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..

Broadband Plans: కరోనా కాలంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రంహోం పెరిగిపోయింది. అలాగే ఆన్‌లైన్‌ క్లాసులు వినేవారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ సంఖ్య కూడా..

Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు... ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..
Broadband Plans
Follow us
Subhash Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 15, 2021 | 10:22 AM

Broadband Plans: కరోనా కాలంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రంహోం పెరిగిపోయింది. అలాగే ఆన్‌లైన్‌ క్లాసులు వినేవారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ సంఖ్య కూడా పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ ధరల్లోనే బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందిస్తున్నాయి. డేటా స్పీడ్‌, డేటా లిమిట్‌ను బట్టి ప్లాన్ల ధరలు మారుతున్నాయి. ప్యాకేజీ ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. మెరుగైన డేటా స్పీడ్‌నే కస్టమర్లు ఎంచుకుంటున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్లే కంపెనీలు అత్యధికంగా 1జీబీపీఎస్‌ డేటా స్పీడ్‌తో కూడా ప్యాకేజీలను అందిస్తు్న్నాయి. ప్రస్తుతం రిలయన్స్‌, జియోఫైబర్‌, ఎయిర్‌టెల్‌, ఎక్స్‌స్ట్రీమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌, స్పెక్ట్రా, ఏసీటీ బ్రాడ్‌బ్యాండ్‌, ఎంటీఎన్‌ఎల్‌ వంటి సంస్థలు 1Gbps ఇంటర్నెట్‌ కనెక్షన్లు అందిస్తున్నాయి. వీటి ధరలను పరిశీలిస్తే..

రిలయన్స్‌ జియో ఫైబర్‌ 1Gbps ప్లాన్‌ ధర నెలకు రూ. 3,999 గా ఉంది. ఈ ప్యాకేజీ కింద అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తోంది. దీంతో పాటు నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీప్లస్‌, హాట్‌ స్టార్‌, జియో సినిమా, జీ5 వంటి 15 ఓటీటీ యాప్‌లను కస్టమర్లు యాక్సెస్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల విలువే రూ.1,650 వరకు ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ ఎక్స్-స్ట్రీమ్ VIP ప్లాన్‌ పేరుతో అన్‌లిమిటెడ్‌ 1Gbps స్పీడ్‌తో డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ ధర నెలకు రూ.3,999. ఈ ప్లాన్‌ కింద ల్యాండ్ లైన్ ఫోన్‌తో అపరిమిత లోకల్, STD వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎంటీఎన్‌ఎల్‌ (MTNL) బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు కొన్ని రాష్ట్రాల్లో మెరుగైన సంఖ్యలో ఉన్నాయి. దిల్లీ, ముంబైలలో యూజర్లకు రెండు రకాల 1Gbps ప్లాన్లను ఆ సంస్థ అందిస్తోంది. FTH-2990 ప్లాన్ ధర నెలకు రూ.2,990. ప్రారంభ ఆఫర్లో భాగంగా.. ఈ ప్లాన్‌ ద్వారా నెలకు 6000GB డేటాను MTNL అందిస్తోంది. FTH-4990 పేరుతో మరో ప్లాన్‌ను కూడా సంస్థ అందిస్తోంది. నెలకు రూ. 4,990 విలువ ఉన్న ఈ ప్లాన్‌ ద్వారా 12000 GB డేటాను పొందవచ్చు.

స్పెక్ట్రా సంస్థ.. ‘స్పెక్ట్రా ఫాస్టెస్ట్ ప్లాన్’తో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్యాకేజీని అందిస్తోంది. ఫాస్టెస్ట్ ప్లాన్‌తో నెలకు 500GB డేటాను స్పెక్ట్రా అందిస్తోంది. దీని ధర నెలకు రూ.1,549. దీంతోపాటు సెమీ యాన్యువల్, యాన్యువల్ ప్లాన్లతో అపరిమిత డేటా ప్యాకేజీని కూడా ఆ సంస్థ అందిస్తోంది.

అలాగే యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 1Gbps ప్లాన్‌ను అందిస్తోంది. యాక్ట్ గిగా ప్లాన్ పేరుతో నెలకు 2,500GB డేటాను ఆ సంస్థ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర నెలకు రూ.5,999.

ఇవీ చదవండి: Sony Smart Tv: స్మార్ట్‌ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై సోనీ భారీ ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీల విడుదల

LPG Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? రూ.50 లక్షల వరకు బెనిఫిట్‌.. ఎలాగంటే..!

OnePlus 9: వన్ ప్లస్ 9ఆర్ సేల్ తేదీ వచ్చేసింది.. 9 సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఇదే.. అద్భుతమైన ఫీచర్స్‌