Sony Smart Tv: స్మార్ట్‌ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై సోనీ భారీ ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీల విడుదల

Sony Smart Tv: టెలివిజన్ మార్కెట్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సోనీ కంపెనీ ఐపీఎల్‌ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు బ్రాండ్లపై ఆఫర్లను ప్రకటించింది..

Sony Smart Tv: స్మార్ట్‌ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై సోనీ భారీ ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీల విడుదల
Sony
Follow us
Subhash Goud

| Edited By: Shiva Prajapati

Updated on: Apr 14, 2021 | 9:11 AM

Sony Smart Tv: టెలివిజన్ మార్కెట్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సోనీ కంపెనీ ఐపీఎల్‌ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు బ్రాండ్లపై ఆఫర్లను ప్రకటించింది. పలు ఉత్పత్తులపై కొత్త అమ్మకాలను ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై సోనీ కంపెనీ రాయితీలను ప్రకటించింది. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 18వ తేదీ వరకు పలు స్మార్ట్‌ టీవీలపై ఈ ఆఫర్లు ఉండనున్నాయి. స్మార్ట్‌ టీవీలపై 30 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా ఈఎంఐలపై 5శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని తెలిపింది. అంతేకాదు పలు ఓఎల్‌ఈడీ టీవీలపై రెండు సంవత్సరాల పాటు వారంటీ సైతం పొడిగించింది.

అలాగే సోనీ కంపెనీలో టీవీలతో పాటు హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌, సోనీ స్పీకర్లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. పలు హెడ్‌ఫోన్స్‌లపై రూ.7 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. రూ.21,990 ఉన్న స్పీకర్స్‌ను కేవలం రూ. 15,990కే లభిస్తున్నాయి. అలాగే పౌండ్‌ బార్లపై కూడా భారీ మొత్తంలో ఆఫర్లను ప్రకటించింది. పలు మోడళ్ల ఇయర్‌బడ్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. రూ.6 వేలు ఉన్న వాటికి రూ.5వేలు, 5 వేలు ఉన్న వాటికి రూ.4వేల ప్రకటించింది. పలు వేరియంట్లలో ఉన్న బ్లూటూత్‌ స్పీకర్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. రూ.14,990 ఉన్న బ్రాండ్లపై గరిష్టంగా 7 వేల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇలా సోనీ కంపెనీలో రకరకాల బ్రాండ్లపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది.

మార్కెట్లో కొత్త టీవీలు…

అలాగే సోనీ నుంచి కొత్త సిరీస్‌లో టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. పలు సిరీస్‌లలో మొత్తం ఐదు వేరియంట్లలో 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే టీవీలను రూపొందించారు. వీటిలో బ్రేవియా X80J 189 సెం.మీ (75 అంగుళాలు), 165 సెం.మీ (65 అంగుళాలు), 140 సెం.మీ (55 అంగుళాలు), 126 సెం.మీ (50 అంగుళాలు), 108 సెం.మీ (43 అంగుళాల) మోడళ్లు ఉన్నాయి. 4K HDR ప్యానెళ్లు, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫీచర్లతో ఇవి లభిస్తున్నాయి. వినియోగదారులు గూగుల్ స్ట్రీమింగ్ సేవల నుంచి 7 లక్షలకు పైగా సినిమాలు, టీవీ ఎపిసోడ్లను బ్రౌజ్ చేయవచ్చు. ఈ మోడళ్లు గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి టీవీల్లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్లు ఉంటాయి.

ఈ సిరీస్‌లలో KD- 65X80J మోడల్‌ ధర రూ.1.30 లక్షల వరకు ఉంది. దేశంలోని అన్ని సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. X80J సిరీస్‌లో 108 సెం.మీ (43 అంగుళాల) నుంచి 189 సెంటీమీటర్ల (75 అంగుళాల) కొత్త మోడళ్లను త్వరలో విడుదల చేస్తామని సోనీ ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి: LPG Cylinder Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోండిలా..!

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌