Covid-19: తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారిన పండగలు… కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు
Telangana Covid-19: కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక తెలంగాణలో అయితే కరోనా...
![Covid-19: తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారిన పండగలు... కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/04/Covid-19-2.jpg?w=1280)
Telangana Covid-19: కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక తెలంగాణలో అయితే కరోనా వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. మాస్క్‌లు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు పోలీసులు. మాస్క్‌లేకపోతే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తు్న్నారు. ఇక ఇదే సమయంలో ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈనెల 13 నుంచి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు.. మే 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అలాగే ఈనెల 21న శ్రీరామ నవమి, ఏప్రిల్ 27న హనుమాన్ జయంతి ఇలా పండగలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతుండటం, వైపు పండగలు ఉండటంతో కరోనా కట్టడికి ప్రత్యేక దృష్టి సారించారు. పండలపై ఆంక్షలు విధించారు. ఇలాంటి పండగ ఉత్సవాల్లో జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా జనాలు గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నారు. అయితే మరోసారి తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాపిస్తున్నప్పటికీ, అవేమి లేవని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. అయితే రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించేందుకు ఆస్కారం ఉంది గానీ.. లాక్‌డౌన్ ఉండదని మంత్రి ఈటెల చెప్పారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు.
సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఏమన్నారంటే..
అలాగే గాలి, వెలుతురు సరిగ్గా లేని చిన్న గదులు, దవాఖానలు, పబ్లిక్ టాయ్‌లెట్లు ఉన్న ప్రాంతాల వద్ద గాలిలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని అన్నారు. ఇండ్లలో కూడా ప్రతి గదిలో గాలి, వెలుతురు బాగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కరోనా సోకినట్లు అనుమానాలున్న వ్యక్తులను కుటుంబసభ్యుల నుంచి వేరుగా ఉంచి సపర్యలు చేయాలని అన్నారు. మాస్క్ అనేది రక్షణ కవచం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని సూచించారు.
వైరస్ గాలిలో ఉంటున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ లేకపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం హెచ్చరిస్తున్నారు. చాలా మంది మాస్క్ ధరించకుండా కనిపిస్తున్నారని, అలాంటి వారి వల్లనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారని, ఇలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్లనే కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ఇవీ కూడా చదవండి: CS meet CM KCR: మరికాసేపట్లో కేసీఆర్‌తో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక భేటీ.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుపై చర్చ
నేటి నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శన బంద్.. కరోనా నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక ఆదేశాలు