Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘నువ్వా.. నేనా..’ రెండు గంటలపాటు మేకల మధ్య హోరాహోరీ ఫైటింగ్!

సరదాగా అనిపించినా.. ఈ రెండు మేకల మధ్య ఫైటింగ్ మాత్రం సీరియస్ గా జరిగింది. మనకు బాక్సింగ్.. కిక్ బాక్సింగ్, కుస్తీ పోటీలు...రింగ్ ఫైటింగ్‌లు తెలుసు. మనుషులే కాదు ఫైటింగ్ లలో మేము కూడా తక్కువ కాదు అంటూ బాహుబలిలో ప్రభాస్, రానా, నాయకుల మధ్య పోరులా నడి రోడ్డు మీద ఫైటింగ్ చేశాయి. ఇదేదో కొద్ది సేపు అనుకుంటే పొరపాటే. సుమారు రెండు గంటల పాటు నువ్వా...నేనా...అనే రేంజ్ లో మల్ల యుద్ధం..

Telangana: 'నువ్వా.. నేనా..' రెండు గంటలపాటు మేకల మధ్య హోరాహోరీ ఫైటింగ్!
Two Goats Fought For 2 Hours
Follow us
N Narayana Rao

| Edited By: Srilakshmi C

Updated on: Sep 20, 2023 | 1:00 PM

ఖమ్మం, సెప్టెంబర్ 20: సరదాగా అనిపించినా.. ఈ రెండు మేకల మధ్య ఫైటింగ్ మాత్రం సీరియస్ గా జరిగింది. మనకు బాక్సింగ్.. కిక్ బాక్సింగ్, కుస్తీ పోటీలు…రింగ్ ఫైటింగ్‌లు తెలుసు. మనుషులే కాదు ఫైటింగ్ లలో మేము కూడా తక్కువ కాదు అంటూ బాహుబలిలో ప్రభాస్, రానా, నాయకుల మధ్య పోరులా నడి రోడ్డు మీద ఫైటింగ్ చేశాయి. ఇదేదో కొద్ది సేపు అనుకుంటే పొరపాటే. సుమారు రెండు గంటల పాటు నువ్వా…నేనా…అనే రేంజ్ లో మల్ల యుద్ధం చేశాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల సరిహద్దులో రెండు మేకలు మనుషుల్లా ఫైటింగ్ చేశాయి. అదేదో కొద్ది సమయం అయితే ఒకే. కానీ…సుమారు రెండు గంటల పాటు రణరంగంలో యుద్ధ వీరుల్లా… మల్ల యోధుల్లా.. రింగ్‌లో కిక్ బాక్సింగ్ ఫైటర్లు లా ఫైటింగ్ చేస్తూనే ఉన్నాయి. అదేనండి రెండు మేకలు కుస్తీ పోటీలు పెట్టుకున్నాయి. మరి వాటికి ఏ గెట్టు పంచాయితీ వచ్చిందో ఏమో తెలియదు గానీ… సరిగ్గా రెండు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్ర బంజర, కర్రాలపాడు గ్రామాల సరిహద్దు లో నడి రోడ్డు పై ఫైటింగ్ కు దిగాయి.

మనుషుల కంటే మేమే ఫైటింగ్ బాగా చేస్తామని రోడ్డు మీద పోయే వారికి ఫైటింగ్ చేస్తూ…కెమెరాకు ఫోజులు ఇస్తున్నాయి. సుమారు రెండు గంటల పాటు ఆ రెండు మేకలు ఫైటింగ్ చేయడాన్ని చూసి గ్రామస్థులు ఆచ్చర్య పోయారు. ఇదేదో బాహుబలి సినిమాలో కథానాయకులు ప్రభాస్, రానా ల మధ్య ఫైటింగ్ సీన్ ల తలబడుతున్నాయని చూసి నవ్వుకుంటున్నారు. మేకల కాపరి మాత్రం ఇవి ప్రతి రోజూ ఇలానే ఫైటింగ్ చేస్తాయి. వాటికి అది మామూలే. కానీ గూటికి చేరుకున్నాక మళ్ళీ కలిసి పోతాయి అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఏదో గెట్టు తగాదాల సరిహద్దులో బలే ఫైటింగ్ చేస్తున్నాయే.. అనుకుంటూ వెళ్తున్నారు అటుగా వెళ్ళే వాహనదారులు. నువ్వా నేనా అన్నట్లు సాగిన మేకల ఫైటింగ్ అటుగా వెళ్ళే వారు ఆసక్తిగా చూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.