Vijayashanti: బీజేపీలో రాములమ్మ ప్రతిఘటన..! విజయశాంతి ట్వీట్‌ల వెనుక మర్మమేంటి..? కాషాయ పార్టీలో కలకలం..
Telangana BJP: విజయశాంతి.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. నటిగా.. మెదక్ మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమకారురాలిగా సుపరిచితులు. గతంలో బీజేపీ అగ్రనేత అద్వానీ నిర్వహించిన రథయాత్రలో కీలకంగా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఆమెనే సారథ్యం వహించారు.
Telangana BJP: విజయశాంతి.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. నటిగా.. మెదక్ మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమకారురాలిగా సుపరిచితులు. గతంలో బీజేపీ అగ్రనేత అద్వానీ నిర్వహించిన రథయాత్రలో కీలకంగా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఆమెనే సారథ్యం వహించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పార్టీపై అసంతృప్తితో బీజేపీలో చేరారు.. అయితే, విజయశాంతి బీజేపీలో చేరిన తర్వాత.. ఆ స్థాయిలో ఆమెకు ప్రాధాన్యత దక్కడంలేదని ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కాషాయ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి వేదికపై విజయశాంతిని మాట్లాడించలేకపోతున్నారు. ఇదే ఆమె మనుసు నొప్పించడానికి కారణమైనట్లు తెలుస్తోంది. బీజేపీ సమావేశాల్లో ఒకరిద్దరికే మాట్లాడించే ఆనవాయితీ ఉంది. వేదికపై ఎంత మంది ఉన్నా.. ప్రోటోకాల్ ప్రకారం సందర్భోచితంగా మాట్లాడిస్తున్నారు. దీంతో విజయశాంతికి పలు సమావేశాల్లో మాట్లాడే అవకాశం దక్కడంలేదు. ముఖ్య నేతల సమావేశంలోనూ ఆమెకు ఆహ్వానం అందడంలేదని సమాచారం. దీంతో ఆమె కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తితోనే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని టాక్..
విజయశాంతి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే నేతలను కలవరపెడుతున్నారు. ఆమె చేస్తున్న వరుస ట్వీట్లు పార్టీకి మైనస్ అయ్యేలా ఉంటున్నాయి. పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆ ట్వీట్ల ఆధారంగా ఆమె బీజేపీలో కొనసాగుతారా? లేదా? అనే చర్చ కూడా మొదలైనట్లు సమాచారం.. ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చి.. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై విజయశాంతి హర్ట్ అయ్యారు. అదేరోజు తెలంగాణ వ్యతిరేకించిన వారితో స్టేజీ పంచుకోవడం ఇష్టం లేకే తాను మధ్యలోనే వెనుదిరిగినట్లు ట్వీట్ చేసి.. షాకిచ్చారు. అంతేకాకుండా మణిపూర్ హింస గురించి కూడా ట్విట్ చేశారు.
సోనియా గురించి విజయశాంతి చేసిన ట్వీట్..
ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని… pic.twitter.com/TdySxpX4dJ
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 17, 2023
కాగా, తాజాగా ఆమె చేసిన ట్వీట్ పొలిటికల్ గా హీట్ పెంచింది. ఇటీవల సోనియాను అభిమానిస్తామని చేసిన ట్వీట్‌తో ఆమె బీజేపీలో ఉంటారా? లేక హస్తం గూటికి వెళ్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘బీఆర్ఎస్ ను ఓడించడానికి పోటీలో లేని జాతీయ పార్టీని తెలంగాణ ప్రజలు పక్కన పెడుతున్నారు’ అనే ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోటీలో లేని జాతీయ పార్టీ కాంగ్రెసా? లేక బీజేపీయా? ఏదనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి ఇండైరెక్ట్ గా బీజేపీనే అన్నారా? అనే అనుమానాలను నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఒక్క ట్వీట్ తో నేతలు సందిగ్ధంలో పడిపోయారు. దీనికి తోడు కొద్దిరోజులుగా మీడియాకు కూడా విజయశాంతి దూరంగానే ఉంటున్నారు. కేవలం ట్వీట్లకే పరిమితమయ్యారు.
గతంలో విజయశాంతి చేసిన ట్వీట్..
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని… pic.twitter.com/l22P9lvyxm
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 21, 2023
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ.. ఇంతగా రియాక్ట్ కావడం వెనుక ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో కూడా పార్టీలో ఓ వర్గం నేతలు అనుమానిస్తున్నారు. విజయశాంతి భుజంపై గన్ను పెట్టి.. ట్వీట్ల తూటాలు పేల్చుతున్నారనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ ట్వీట్ల రచ్చపై హైకమాండ్ ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..