Chinna Jeeyar Swami : రామాయణంపై ఈ నెల 24న గ్లోబల్ క్విజ్ .. ఇవిగో పూర్తి వివరాలు
రామాయణ మహాకావ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో క్విజ్ నిర్వహించున్నట్టు త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించే ఈ క్విజ్‌లో విజేతలకు 9 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేయనున్నారు. ఈ క్విజ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఈ క్విజ్ నిర్వహిస్తామని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. వయస్సును బట్టి ఈ క్విజ్ మూడు విభాగాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది.
సమతా మూర్తి రెండో వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ సెమినార్ మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్టు చినజీయర్ స్వామి తెలిపారు. ప్రపంచదేశాలకు చెందిన వైజ్ఞానికులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పార్లమెంట్ కొత్త భవనంలో అడుగుపెట్టిన పాలకులకు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మంగళశాసనాలు తెలిపారు. సమతామూర్తి రెండో వార్షికోత్సవం సమతా కుంభ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. వీటితో పాటు ఈ ఏడాది దసరా నుంచి సమతామూర్తి సన్నిధిలోని దివ్యదేశాల్లో ప్రత్యేక సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చిన్నజీయర్ స్వామి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos