- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: avoid these mistakes with Tusli Plant or else may face several problems
Vastu Tips: తులసి మొక్కను పెంచుతున్నారా..? అయితే ఈ తప్పులను అసలు చేయకండి.. చేశారంటే ఇక అంతే సంగతి..!
Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ప్రముఖ స్థానం ఉంది. ఇక తులసి మొక్కకు నిత్యం దీపారాధానతో పూజలు చేస్తే ఇంట్లో ప్రశాంతత, ఆనందం కలుగుతాయని అనాది కాలం నుంచి హిందువుల నమ్మకం. వాస్తు ప్రకారం తులసి కోటను ఇంటికి తూర్చు దిశలో మాత్రమే ఏర్పాడు చేసుకోవాలి. అలాగే దక్షిణ దిశలో పొరపాటున కూడా పెట్టుకోకూడదు.
Updated on: Sep 21, 2023 | 1:26 PM

Vastu Tips: ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన తులసి మొక్కలోని ప్రతి భాగం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ కారణంగానే ఆయుర్వేద వైద్యంలో తులసి ఆకులు, గింజలు, వేర్లను కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి మొక్క విషయంలో కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలి. అవేమిటంటే..?

ముళ్ల మొక్కలు: తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్కలను అసలు పెంచకూడదు. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా ప్రతికూలత వ్యాపిస్తుంది.

చెప్పులు: నిత్యం పూజించే తులసి మొక్క అవరణలో బూట్లు, చెప్పులను ఉంచకూడదు. తులసి మొక్కకు దగ్గర్లో ఇవి ఉంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం, అనారోగ్య సమస్యలు వెంటాడతాయని నిపుణులు చెబుతున్నారు.

చీపురు, డస్ట్‌బిన్: తులసి మొక్క దగ్గర డస్ట్‌బిన్ లేదా చీపురును కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఈ వస్తువులను ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు, ఇంకా అవి శుభ్రమైనవి కాదు. ఈ కారణంగానే తులసి కోట దగ్గరలో చీపురు లేదా డస్ట్ బిన్ ఉండకూడదు.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.





























