AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: విషం చిమ్మడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యం.. ప్రధాని మోదీకి టీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన.. పొలిటికల్ మంటలను రాజేసింది. ఆయన చేసిన కామెంట్స్‌ మరింత సీన్‌ను క్రియేట్ చేశాయి. బేగంపేట సభలో, రామగుండం సభలో..

Bjp vs Trs: విషం చిమ్మడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యం.. ప్రధాని మోదీకి టీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్..
Bjp Vs Trs
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2022 | 9:47 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన.. పొలిటికల్ మంటలను రాజేసింది. ఆయన చేసిన కామెంట్స్‌ మరింత సీన్‌ను క్రియేట్ చేశాయి. బేగంపేట సభలో, రామగుండం సభలో ప్రధాని మోదీ ఎంత సీరియస్ కామెంట్స్ చేశారో.. టీఆర్ఎస్ నుంచి కూడా అంతే ధీటుగా కౌంటర్లు వచ్చాయి. తెలంగాణపై విషం చిమ్మడం తప్ప ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్‌కు దిగారు. ఉత్త చేతులతో వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో మోదీ.. సింగరేణి కార్మికులను రాజకీయంగా తప్పుదోవ పట్టించారని కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత వినోద్. సింగరేణి ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో ఒకమాట.. రామగుండంలో మరోమాట చెప్పడమేంటని ప్రశ్నించారు వినోద్.

ఇక మంత్రి జగదీష్ రెడ్డి కూడా ప్రధాని మోదీపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. మునుగోడులో ఓడిపోయామే అక్కడు ఆయన మాటల్లో ప్రస్ఫుటించిందన్నారు. వడ్డీతో సహా ఇస్తారన్న మోదీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారని కౌంటర్ ఇచ్చారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, టీఆర్ఎస్‌లో అలజడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోసపోవడానికి గుజరాత్ ప్రజలలాంటి వారు కాదని అన్నారు.

నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు విషం కక్కినా.. తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, నీళ్లు, పాలను వేరు చేసినట్లు వారు చిమ్మే విషాన్ని కూడా వేరు చేస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. అబద్ధాల పునాదుల మీద బీజేపీని విస్తరించేందుకు ప్రధాని మోదీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, అది తెలంగాణలో సాగదన్నారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..