TSPSC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ నుంచి దాదాపు 8 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ నుంచి దాదాపు 8 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాఖ విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్-1 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ల పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్‌సీ వెబ్ సైట్ లో ఉంచారు.
కాగా, అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వచ్చాయి. మరికొన్నిరోజుల్లో పోలీస్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..