AIIMS Recruitment: ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగవకాశాలు.. అర్హులు ఎవరంటే..

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిమ్స్‌ దిల్లీ/ ఎన్‌సీఐ ఝజ్జర్(హరియాణా)లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న గ్రూప్‌ఎ, బి, సిల్లో మొత్తం..

AIIMS Recruitment: ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగవకాశాలు.. అర్హులు ఎవరంటే..
Aiims Jobs
Follow us

|

Updated on: Nov 12, 2022 | 7:57 PM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిమ్స్‌ దిల్లీ/ ఎన్‌సీఐ ఝజ్జర్(హరియాణా)లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న గ్రూప్‌ఎ, బి, సిల్లో మొత్తం 254 భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సైంటిస్ట్-1 (3), సైంటిస్ట్-2 (5), క్లినికల్ సైకాలజిస్ట్/ సైకాలజిస్ట్ (1), మెడికల్ ఫిజిసిస్ట్ (4), అసిస్టెంట్‌ బ్లడ్/ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ (4), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (10), ప్రోగ్రామర్ (3), పెర్ఫ్యూషనిస్ట్ (1), అసిస్టెంట్ డైటీషియన్ (5), మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-2 (10), జూనియర్ ఫిజియోథెరపిస్ట్‌/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌ (5), స్టోర్ కీపర్ (డ్రగ్స్/ జనరల్) (12), జూనియర్ ఇంజినీర్ (ఎసీ & రెఫ్రిజరేటర్‌) (8), టెక్నీషియన్ (రేడియో థెరపీ) (3), స్టాటిస్టికల్ అసిస్టెంట్ (2), ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ గ్రేడ్-1 (3), టెక్నీషియన్ (రేడియాలజీ) (12), ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (18), జూనియర్ ఫొటోగ్రాఫర్ (3), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (44), శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2 (4), న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ (1), స్టెనోగ్రాఫర్ (14), డెంటల్ టెక్నీషియన్ గ్రేడ్-2 (3), అసిస్టెంట్ వార్డెన్ (1), సెక్యూరిటీ- ఫైర్ గార్డ్ గ్రేడ్-2 (35), జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (40) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు ఫీజుగా రూ. 2,400, ఇతరులు రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 19-11-2022న ప్రారంభమై 19-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..