Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు కీలక సూచన చేసిన విద్యుత్ శాఖ
Telangana Heavy Rains: గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది.
Telangana Heavy Rains: గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 27, 28,29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఆదేశించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున కీలక సూచన చేశారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ జన్‌క్షన్ బాక్సులు, విద్యుత్ ఫెన్సింగ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్లు తెగిన, దానికి సంబంధించిన ఇతర సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ లేదా టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నంబరు 18004250028, టోల్‌ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేయాలని కోరారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారానూ ఫిర్యాదులు చేయొచ్చు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం..
హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగైదు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఇద్దరు అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సాయం కావాల్సి వస్తే ప్రజలు కంట్రోల్ రూమ్‌కు 040 23202813ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Rainfall to intensify into heavy & very heavy rainfall in the next 4-6 hours & incessant rainfall may continue for the next 48 hours. High Alert has been issued to all personnel & teams of GHMC. Citizens are advised to avoid any unnecessary travel. @KTRTRS @arvindkumar_ias pic.twitter.com/la0T6ewlyG
— Director EV&DM, GHMC (@Director_EVDM) September 27, 2021
భారీ వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో ఇవాళ జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలు వాయిదాపడ్డాయి.
Also Read..
Hyderabad Rains: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.. హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక..