AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్న నార్కోటిక్స్ బ్యూరో.. రెండు నెలల్లోనే కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

జూన్, జూలై నెలల్లో 196 కేసులలో 175 గంజాయికి సంబంధించిన కేసులు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు 353 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 21 ఇతర మాదకద్రవ్యాల కేసుల్లో మరో 46 మందిని అరెస్టు చేశారు. గంజాయి,MDMA,హెరాయిన్, కోకైన్, నల్లమందు,హాష్ ఆయిల్,గంజా వీడ్ ఆయిల్ ఇంజెక్షన్లు, పౌడర్ టాబ్లెట్లను వివిధ రూపాల్లో రవాణా చేస్తుండగా సీజ్ చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ 26 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు.

Telangana: కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్న నార్కోటిక్స్ బ్యూరో.. రెండు నెలల్లోనే  కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Cv Anand
Sravan Kumar B
| Edited By: |

Updated on: Aug 28, 2023 | 5:34 PM

Share

తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూ స్ట్రాటెజీస్.. కోఆర్డినేషన్, అవేర్నెస్ డ్రైవ్‌లతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మే 31, 2023న ప్రారంభం అయిన ఈ కొత్త బ్యూరో NDPS కేసుల కోసం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. అలాగే కేంద్ర ఏజెన్సీలు మరియు రాష్ట్ర విభాగాలతో కోఆర్డినేట్ చేస్తుంది. గ్లోబలైజేషన్, రిటైల్ పంపిణీలో సాంకేతికత, ఆవిష్కరణ కోసం వేగవంతమైన పురోగతికి ఆజ్యం పోసింది. అయితే డ్రగ్స్ అక్రమ రవాణాకు పెడలర్స్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ.. TSNAB, రాష్ట్ర పోలీసులచే యాంటీ నార్కోటిక్స్ ఆక్టివిటీస్‎ని కట్టడి చేస్తూన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన ఈ బ్యూరో రెండు నెలల్లో కోట్ల రూపాయల డ్రగ్స్ సీజ్ చేయగలిగింది.

జూన్, జూలై నెలల్లో 196 కేసులలో 175 గంజాయికి సంబంధించిన కేసులు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు 353 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 21 ఇతర మాదకద్రవ్యాల కేసుల్లో మరో 46 మందిని అరెస్టు చేశారు. గంజాయి,MDMA,హెరాయిన్, కోకైన్, నల్లమందు,హాష్ ఆయిల్,గంజా వీడ్ ఆయిల్ ఇంజెక్షన్లు, పౌడర్ టాబ్లెట్లను వివిధ రూపాల్లో రవాణా చేస్తుండగా సీజ్ చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ 26 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు. జూన్‌లో “మిషన్ పరివర్తన” పేరుతో 3 రోజులు యువతకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల ఆక్టివిటీస్ ద్వారా అవగాహన పెంచడంతోపాటు డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారి కోసం ఈ ప్రోగ్రాం చేరే విధంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.

అలాగే డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలంటే పోలీస్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.. అలాగే అన్ని విభాగాల సమన్వయం ఆవశ్యకతను వివరించారు. గత రెండేళ్లలో పెరిగిన డ్రగ్స్ వినియోగం వాటి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, డ్రగ్స్ తయారీ అక్రమ రవాణా వినియోగం ఎలా నిఘా పెట్టాలి అనే విషయాలను సీవీ ఆనంద్ వివరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగతంగా, సమాజపరంగా కుటుంబ పరంగా జరుగుతున్న నష్టాలు.. పెరుగుతున్న నేరాల సంఖ్య తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్ సహా మిగతా ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా డ్రగ్స్  విక్రేతలు యవతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. డ్రగ్స్ కేసుల్లో కళాశాలలో చదువుతున్నటువంచి విద్యార్థులు కూడా ఇరుక్కోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా డ్రగ్స్ కట్టడికి తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్