Telangana: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు రాజీనామా.. కార్పొరేషన్ల చైర్మన్లు కూడా..
ఓఎస్‌డీ ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ రావు.. మారిన సమీకరణాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావుకు.. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఓఎస్‌డీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది..

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకుని.. అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటమి పాలైన నేపథ్యంలో పలువురు అధికారులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా చేశారు. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్‌రావు తన రాజీనామా లేఖలో వివరించారు. అంతేకాకుండా రాష్ట్రానికి చెందిన పలు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తామన్నారు. ఈ మేరకు పలు కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా.వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.
ఓఎస్‌డీ ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ రావు.. మారిన సమీకరణాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావుకు.. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఓఎస్‌డీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.. ఈ క్రమంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ప్రభాకర్ రావు ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో.. తాజా పరిణామాల దృష్ట్యా రాజీనామా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..