స్థానిక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు.. మరోసారి షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియపై తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కొత్త నోటిఫికేషన్ ముందు ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది. బుధవారం (నవంబర్ 19) నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు ఓటర్ల జాబితాల్లో లోపాలను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రెడీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియపై తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కొత్త నోటిఫికేషన్ ముందు ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో… గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల సవరణకు SEC ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. బుధవారం (నవంబర్ 19) నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు ఓటర్ల జాబితాల్లో లోపాలను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రెడీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించడానికి ప్రక్రియ ప్రారంభించినట్లయింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నేటి నుంచి కొత్త ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పులు సరిదిద్దే ప్రక్రియ కొనసాగనుంది. పేరు తప్పులు, అడ్రస్ మార్పులు, మరణించినవారి పేర్ల తొలగింపులు చేపడతారు. 22న అభ్యంతరాలు పరిష్కరించనున్నారు.
నవంబర్ 23వ తేదీన తుది ఓటర్ జాబితా విడుదల కానుంది. తుది ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురిస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్థానిక ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,769 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మూడు దశల్లో పూర్తయ్యేలా తెలంగాణ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




