ఒక్కరోజు ముందుగానే..! అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత కోర్టు ముందుకు వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గురువార (నవంబర్ 20) నాంపల్లి కోర్టుకు హాజరుకాబోతున్నారు . దాదాపు ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు వస్తున్నారు. ఉదయం 10గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.

ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ, దీనిపై CBI అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. జగన్ తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని సీబీఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో, నవంబర్ 21లోగా హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో.. ఒకరోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తున్నారు జగన్.
చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే, దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వస్తున్నారు. ఉదయం పదకొండున్నరకల్లా కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..