Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 24,686 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 247 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 18, 2022 | 8:47 PM

Telangana’s Covid-19 cases: తెలంగాణలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు 200లకు పైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 24,686 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 247 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కాగా.. 116 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం రాత్రి హెల్త్ బులెటిన్‌‌ను విడుదల చేసింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. మరణాలు నమోదు కాలేదు. రికవరీ రేటు రాష్ట్రంలో 99.24 శాతంగా ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,912 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 157 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 200 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో కేసుల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,95,819
  • కోలుకున్న వారి సంఖ్య 7,89,796
  • మరణాల సంఖ్య 4,111
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 3,53,00,795 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

కాగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు యథావిధిగా ధరించాలని కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Telangana Corona Updates

Telangana Corona Updates

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..