Telangana: రసవత్తరంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు.. జూపల్లిలో మంత్రి కేటీఆర్ మంతనాలు..!
Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు, స్వయంగా కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో,
Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు, స్వయంగా కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో, పాలిటిక్స్ హీటెక్కాయి. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలపై సీరియస్ ఫోకస్ పెట్టింది, టీఆర్‌ఎస్ పార్టీ. ముఖ్యంగా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కొల్హాపూర్ గులాబీ గూటిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, కార్ ఎక్కడంతో, కొల్లాపూర్ టిఆర్ఎస్‌లో అగ్గి రాజుకుంది.
తాజా, మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు. అటు, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో ఐక్యత లేదనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఈ ఇష్యూపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లారు. కొల్లాపూర్‌లో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో, జూపల్లిని కేటీఆర్ కలవడం జిల్లా రాజకీయాలను హీటెక్కించింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గ్రూపు రాజకీయాలపై జూపల్లితో మంత్రి కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలాసార్లు మాజీమంత్రి జూపల్లి, తమ సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. గతంలో కేసీఆర్ టూర్‌కు, ప్రస్తుత KTR సభకు కూడా జూపల్లి కృష్ణారావు దూరంగా ఉన్నారు.