AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి, కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది.

తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు!
Telangana Political Tension
Balaraju Goud
|

Updated on: Jul 02, 2026 | 11:53 AM

Share

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి, కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది.

ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురుకులాల కొనుగోలు ప్రక్రియ మొత్తం నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగిందని, బీఆర్‌ఎస్‌ నేతలవి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన ప్రొక్యూర్‌మెంట్‌పై కూడా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సవాల్ నేపథ్యంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌ తదితరులు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పులపై చర్చకు తాము సిద్ధమంటూ బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రి జూపల్లి చెప్పినట్లు కేటీఆర్ తెలంగాణ భవన్‌లోనే ఉంటారని, తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి గన్‌పార్క్‌కు వెళ్తానని హరీశ్‌రావు ప్రకటించారు. అయితే హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. “సవాల్ విసిరితే అప్పుల లెక్క చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేము వస్తాము అంటే పోలీసులు, ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు” అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల అడ్డగింతతో కారు దిగిన హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతలు గన్‌పార్క్‌ వైపు నడుచుకుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పోలీసుల వలయాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us