Hyderabad: చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు.. ఏం చేశాడో తెలిస్తే..
హైదరాబాద్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు సయ్యద్ ముఖర్రమ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నింతుడికి 20 ఏళ్ల రంగారెడ్డి జిల్లా కోర్టు. 16 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి డిసెంబర్ 18న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలికను సురక్షితంగా గుర్తించారు. విచారణలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ముఖర్రమ్‌తో బాలికకు పరిచయం ఉన్నట్లు తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడిపై ఐపీసీ 376(2)(n), 366 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం-2012లోని 5(l), 6 సెక్షన్ల కింద అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పోలీసులు సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో సయ్యద్ ముఖర్రమ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.
నిందితుడికి శిక్ష పడేలా కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో అప్పటి మహేశ్వరం ఏసీపీలు బి. శ్రీనివాస్, పి. లక్ష్మీకాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న వాదనలు వినిపించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఇ. వెంకటేష్‌తో పాటు సమ్మన్స్, వారెంట్ ఎగ్జిక్యూషన్ టీమ్, లైజన్ అధికారులు కూడా కేసు విచారణలో సహకరించారు. సమర్థవంతమైన దర్యాప్తు, బలమైన ఆధారాల సమర్పణతో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని పహాడీషరీఫ్ పోలీసులు అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
