AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం! వీడియో

హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలోని పీర్జాదిగూడ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలో అర్ధరాత్రి నలుగురు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఇళ్ల చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ ఇంట్లోకి ప్రవేశించిన వారు.. మరో ఇంటి గోడ దూకేందుకు ప్రయత్నించగా, మహిళ అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం! వీడియో
Midnight Theft Attempt In Uppal
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 31, 2026 | 7:49 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్ 31: హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలో నలుగురు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో కాలనీలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు.. అనుమానాస్పదంగా ఇళ్ల చుట్టూ తిరుగుతూ చోరీకి అనువైన ఇళ్ల కోసం గాలించారు. ముందుగా ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడ విలువైన వస్తువులు ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటిని టార్గెట్‌ చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు గోడ దూకడానికి ప్రయత్నించారు. అయితే దొంగల కదలికలను గమనించిన ఇంట్లోని మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. దీంతో ఒక్కసారిగా భయపడిన దుండగులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

అయితే అంతటితో ఆగకుండా దొంగలు కొంతసేపు కాలనీలోనే తిరుగుతూ చోరీకి మరోసారి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీలో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. తమ కాలనీలో రాత్రి వేళల్లో భద్రతను మరింత పెంచాలని పోలీసులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురు దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలోనూ ఇదే ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు స్థానికులకు సూచిస్తున్నారు.

Follow Us
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు