యూపీఐ ద్వారా తప్పుడు వ్యక్తికి డబ్బులు పంపారా..? ఇలా చేస్తే..
Venkatrao Lella
Images: Pinterest
31 August 2026
యూపీఐ ద్వారా డబ్బులు పంపించాలనుకున్నప్పుడు నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం, వేరే నెంబర్ ఎంచుకోవడం లేదా తప్పుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం లాంటి పొరపాట్లు కొంతమంది చేస్తూ ఉంటారు
యూపీఐ చెల్లింపులు నిత్య జీవితంలో ఒక భాగంగా మారాయి. దీంతో కొన్నిసార్లు పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు టెన్షన్ పడనక్కర్లేదు.
మిస్టేక్ వల్ల డబ్బులు వేరేవారికి పంపితే ముందుగా యూపీఐ యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. మీ ట్రాన్సాక్షన్ ఐడీ, రిఫరెన్స్ నెంబర్, తేదీ వంటి వివరాలు అందించండి.
ఆ తర్వాత మీ బ్యాంక్‌కు సమాచారం అందించండి. దీంతో బ్యాంక్ అధికారులు మీకు సహాయం అందించే అవకాశం ఉంటుంది. అవతలి కస్టమర్‌ను సంప్రదించ మీ డబ్బులు తిరిగి వచ్చే సహాయపడవచ్చు.
బ్యాంకులో సమస్య పరిష్కారం కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పథకం ద్వారా కంప్లైంట్ చేయండి. దీంతో మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ ప్రక్రియ తర్వాత కూడా మీ డబ్బులు తిరిగి వెనక్కి రాకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. దీంతో పోలీసులు రిసీవర్‌ను గుర్తించి మీ డబ్బులు తిరిగి వచ్చేలా ప్రయత్నం చేస్తారు.
ఇవన్నీ చేసినా రిసీవర్ మీకు డబ్బులు ఇవ్వకపోతే ఏమీ చేయలేరు. మీరు చేసిన పొరపాటు వల్ల డబ్బులు బదిలీ అయ్యాయి కాబట్టి మీదే తప్పు అవుతుంది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించాలి.
యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి. కరెక్ట్ పర్సన్‌కి పంపుతున్నారా.. లేదా అనేది చెక్ చేసుకోండి.
మీరు డబ్బులు పంపిస్తున్న వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, ఎంత పంపుతున్నారు అనే వివరాలు చెక్ చేసుకోండి. అంతా ధృవీకరించుకున్న తర్వాతనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయండి.