AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ జోష్.. రెండున్నరేళ్ళ ముందే దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ గడువుండగానే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ వేడిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ జోష్.. రెండున్నరేళ్ళ ముందే దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు
Telangana Map, Trs, Congress, Bjp Flags & Kcr, Bandi Sanjay, Revanth Reddy Images Kalipi Okati Urgent
Rajesh Sharma
|

Updated on: Jul 07, 2021 | 7:40 PM

Share

Telangana Politics on full josh Politicians on fire: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ గడువుండగానే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ వేడిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దూకుడును ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తప్పించిన నాటి నుంచి మొదలైన రాజకీయ కార్యకలాపాలు.. క్రమంగా వేగాన్ని పుంజుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎనుముల రేవంత్ రెడ్డిని నియమించడం, ఆయన తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తూ పదవీ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు రేవంత్ రెడ్డి దూకుడుకు అనుగుణంగా అటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇటు భారతీయ జనతా పార్టీ తమదైన శైలిలో స్పందించడం మొదలుపెట్టాయి.

కారణమేదైనా జూన్ రెండో వారం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల పర్యటనలు, తనిఖీలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేశారు. స్వయంగా సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించి వచ్చారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలో రోజంతా గడిపి.. గ్రామస్తులతో కలిసి పంక్తి భోజనం చేశారు. అదే క్రమంలో తానిక తరచూ జిల్లాల పర్యటనకు వెళతానని ప్రకటించారు. జులై 20వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు జరుపుతానని కూడా ఆయన వెల్లడించారు. అదే క్రమంలో పొరుగు రాష్ట్రం కృష్ణా జలాలను అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోందంటూ జల పోరాటానికి తెరలేపారు కేసీఆర్. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేయించారు. ఏపీ జలదోపిడీని అడ్డుకుంటామని శపథం చేశారు. కేంద్రానికి లేఖలను పంపుతూనే వున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా రాజకీయ పర్యటనలు పెంచారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు కూడా అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా కేవలం నాలుగేళ్ళ కాలంలో వేగంగా నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ జులై ఆరున ప్రారంభించారు. మరోవైపు హరీశ్ రావు కూడా సిద్దిపేటలో పలు ప్రారంభోత్సవాలు జరిపారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న వారిపై పైచేయి సాధిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్న రేవంత్ రెడ్డి తన నియామకం జరిగినప్పట్నించి పార్టీ సీనియర్లను ప్రసన్నం చేసుకునే పర్యటనలకు శ్రీకారం చుట్టారు. టీపీసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన వారందరినీ కలుసుకుని మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేశారు. పార్టీ ఒక్కతాటిపై వుందని చాటేందుకు యత్నించారు. తన ఎంపికను బహిరంగంగా ప్రశ్నించిన సీనియర్ నేత వి.హనుమంతరావు లాంటి వారిని కూడా రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. అదే సమయంలో తనదైన వాడీవేడీ ప్రకటనలతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, ఓ రకంగా తెలంగాణ ప్రస్తుతం కేసీఆర్ చేతిలో బందీగా మారిందంటూ తనదైన శైలిలో వాగ్బాణాలు గుప్పించారాయన. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. అధికార పార్టీలో చేరిపోయిన ఎమ్మెల్యేలను చెడామడా ఆడేసుకున్నారు. అదే దూకుడును కొనసాగిస్తూ.. జులై 7న టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను అత్యంత అట్టహాసంగా చేపట్టారు రేవంత్ రెడ్డి.

ఇక నిన్నమొన్నటి దాకా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ.. రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపు వచ్చిందని భావిస్తున్న కమలం నేతలు.. తమ వ్యూహాలను వేగవంతం చేసేందుకు, రాజకీయ కార్యకలాపాలను పెంచేందుకు సిద్దమవుతున్నారు. అదే క్రమంలో తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్లాన్ చేశారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సంజయ్ ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా పాదయాత్ర రూట్‌ని ఖరారు చేస్తోంది. తొలివిడత పాదయాత్రను హుజూరాబాద్ సమీపంలో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రెండు, మూడు విడతల్లో వచ్చే రెండున్నరేళ్ళలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేలా బండి సంజయ్ ప్రణాళిక సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ప్రస్తుతం మూడు పార్టీల నజర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే వుండగా.. అందుకు అనుగుణంగానే పార్టీలు పావులు కదుపుతున్నాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. హుజూరాబాద్‌లో గెలవడం ద్వారా.. కొందరు నాయకులు పార్టీని వీడినా.. కేసీఆర్ చరిష్మాకు ఢోకా లేదని చాటేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు శ్రమిస్తున్నారు. హుజూరాబాద్‌లో పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవడంతోపాటు.. పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న సామాజిక వర్గాలు చేజారకుండా వ్యూహాలు రచిస్తున్నారు గులాబీ నేతలు. ఇక టీఆర్ఎస్ ఓటమికి హుజూరాబాద్‌లోనే శ్రీకారం చుట్టాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు స్వంతంగా వున్న పట్టుకు, పార్టీ బలాన్ని కలగలిపి విజయం సాధిస్తామని కమల దళం ఘంటాపథంగా చెబుతోంది. రేవంత్ రెడ్డి రాకతో రెట్టించిన ఉత్సాహంతో వున్న కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కౌశిక్ రెడ్డి రూపంలో ధీటైన అభ్యర్థి వున్నారంటూ.. గెలుపు తమదేనని చెబుతున్నారు. ఏదిఏమైనా మూడు పార్టీల యాక్టివిటీస్ పెరగడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి.

ALSO READ: రెండున్నరేళ్ళ తర్వాత భారీ ప్రక్షాళన.. వీరికి ప్రమోషన్ వెనుక సీక్రెట్ ఇదే..!

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..