యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల వార్నింగ్.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తారట
ఇలాంటి వీడియోలు చేస్తే కేసులు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు. పబ్లిక్ ప్లేసెస్ లో రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు.

సోషల్ మీడియాలో యూ ట్యూబర్ హర్ష వెదవ వేషాలు జనానికి చిర్రెత్తిస్తున్నాయ్. లైకులు కోసం, వ్యూస్ కోసం కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. జనాలను ఇబ్బంది పెడుతూ.. కొంతమంది వెర్రి వేషాలు వేస్తున్నారు. పబ్లిక్‌ను పిచ్చోళ్లను చేసి వీడియో తీసి వైరల్ చేసి.. యూట్యూబ్ నుంచి దండిగా డబ్బులు దండుకునే కుట్రపై టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. పబ్లిక్‌ను ఇబ్బందికి గురిచేస్తూ హర్ష చేస్తున్న హంగామాపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ టీవీ9 ప్రసారం చేసిన కథనాలపై ఎట్టకేలకూ స్పందించారు.
ఇలాంటి వీడియోలు చేస్తే కేసులు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు. పబ్లిక్ ప్లేసెస్ లో రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు. ఇలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే… కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని – తెలంగాణ పోలీసులు తెలిపారు. తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు.” యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు”
రీసెంట్ గా ఓ యూట్యూబర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ లో డబ్బులు గాలిలోకి ఎగరేసి వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లేనివారికి దానం చేస్తూ కొంతమంది వీడియోలు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ పుణ్యమా అని అంత ఇంతో డబ్బులు అకౌంట్స్ లోకి వస్తున్నాయి. ఆ డబ్బులు చూసి కొంతమందికి ఇలా పిచ్చి ముదురుతోంది. లేనివాళ్లకు ఇస్తే సాయం అవుతుంది. ఇలా విచ్చలవిడిగా గాలిలోకి ఎగరేసి వీడియోలు చేస్తే .. ఏమంటారో చాలా మందికి తెలుసు. ఒకరికి సాయం చేస్తే పొగడకపోయినా పర్లేదు.. కానీ ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఒక్క పిచ్చి పని చేసినా నలుగురు ప్రశ్నిస్తారు.. మీడియా ఏకి పారేస్తుంది.. పోలీసు చేయాల్సిన పని చేస్తారు. కాబట్టి.. నువ్వు ఎంత మంచి చేసినా సరే.. ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండేలా ప్రవర్తించాలి.
View this post on Instagram
గాలిలోకి డబ్బులు విరిసిన యూట్యూబర్
YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in Hyderabad
Cyberabad police will you please take action?
A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp
— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
