AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏ జాబ్ కావాలి.. హైదరాబాద్‌లో ఘరానా మాయగాళ్లు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 107 మంది నుంచి కోటి 4 లక్షల రూపాయలు వసూలు చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

Hyderabad: ఏ జాబ్ కావాలి.. హైదరాబాద్‌లో ఘరానా మాయగాళ్లు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..
Hyderabad Police
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2024 | 8:06 AM

Share

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి పేరుతో ఫోన్ లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్‌లు, అమాయక ప్రజలకి డబుల్ బెడ్రమ్స్, ఫుడ్ కార్పొరేషన్‌లో జాబ్ లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డి తో పాటు మరో ఐదుగురు నిందితులను మల్కజ్‌గిరి ఎస్వోటీ, కీసర పోలీస్ లు అరెస్టు చేశారు. నిందితులంతా జాబ్‌లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురి నుంచి 98 నకిలీ డబుల్ బెడ్‌రూమ్స్ కేటాయింపు పత్రాలు, కీసర RDO స్టాంప్‌లు, లక్షా 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితుల్లో ఏడుగురు విద్యాశాఖ అధికారులు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారని.. సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతూ ముఠా సభ్యులు చాలా మందిని మోసం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు రాచకొండ CP సుధీర్ బాబు స్పష్టం చేశారు. దాదాపుగా 107 మంది నుంచి కోటి 4 లక్షల రూపాయలు ముఠా సభ్యులు వసూలు చేశారని తెలిపారు.

సురేందర్ రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2021 సంవత్సరంలో క్రికెట్ బెట్టింగ్ కేసులో నేరడ్ మెట్ పీస్‌లో సురేందర్ రెడ్డి A1 గా అరెస్ట్ అయ్యాడని తెలిపారు. నవంబర్ 2022 సంవత్సరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని తెలిపారు. దాదాపుగా 107 మంది నుండి ఒక కోటి 4 లక్షల రూపాయలు వసూలు చేశారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 18.5 లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
పాత సిమ్ కార్డులతో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..! అదేలాగో తెలిస్తే
పాత సిమ్ కార్డులతో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..! అదేలాగో తెలిస్తే
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన రేట్లు
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన రేట్లు
'ధురంధర్ 2' టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
'ధురంధర్ 2' టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
OTTలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమా.. IMDBలోనూ టాప్ రేటింగ్