TS PGECET 2023 Results: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. ర్యాంక్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పీజీ ఈసెట్‌)-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను ప్రకటించారు. హాల్‌ టికెట్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌తోపాటు ఇతర అవసరమైన వివరాలు..

TS PGECET 2023 Results: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. ర్యాంక్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
TS PGECET 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2023 | 5:21 PM

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పీజీ ఈసెట్‌)-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను ప్రకటించారు. హాల్‌ టికెట్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌తోపాటు ఇతర అవసరమైన వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 14,882 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మే 29 నుంచి జూన్‌ 1వరకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్ష జరిగింది.

2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌/ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) నిర్వహించిన విషయం తెలిసిందే. పీజీఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.