Talasani: బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి తలసాని స్ట్రాంగ్ వార్నింగ్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదీలేదు!
దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు.
Talasani Srinivas Yadav: దేశంలో నరేంద్రమోడీ(Narendra Modi) రాజ్యాంగం(Constitution) నడుస్తోంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. బీసీ ప్రధానిగా ఉండి కూడా బీసీ మంత్రిత్వశాఖను పెట్టకపోవడం శోచనీయమని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వల్ల కనీసం ఉద్యోగులకు సైతం ఉపయోగం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ- కాంగ్రేస్ కుక్కల్లా మొరుగుతున్నారని ఘాటుగా స్పందించారు మంత్రి తలసాని. అటల్ బిహారీ వాజ్‌పాయి బీజేపీలో భాగస్వామ్యం కాదా? ఎందుకు రాజ్యాంగ పునర్పరిశీలన కోసం కమిషన్ ఎందుకు వేశారని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది ఏంటో చెప్పాలని నిలదీశారు.
అంబేద్కర్‌ను కించపరిచిన అరుణ్ శౌరి లాంటి వ్యక్తులకు మంత్రి పదవులు బీజేపీ ఇచ్చింది వాస్తవం కాదా? అన్న మంత్రి తలసాని.. బీజేపీ-కాంగ్రేస్ నేతలు ఢిల్లీలో రాష్ట్రానికి రావల్సిన నిధులపై నిలదీయాలన్నారు. రాజ్యాంగ సవరణ కావాలని ముఖ్యమంత్రి అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అంబేద్కర్ నిజమైన వారసులం టీఆర్ఎస్ పార్టీ కాబట్టే.. సబ్ ప్లాన్, దళితబంధు తెచ్చామన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక లక్ష రూపాయలైనా ఖర్చు చేయలేదన్నారు. సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని .
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి తెచ్చింది ఏంటి? రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ము ఉంటే ప్రధాని ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రయోజనాలు తెస్తే బీజేపీ ఎంపిలను ఎయిర్ పోర్ట్ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు.