Yadadri Temple: యాదాద్రీశుడికి విరాళంగా మరో కిలో బంగారం ఇవ్వనున్న ఆ నియోజకవర్గ ప్రజలు..
Minister Harish Rao: తెలంగాణ(Telanagana) సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి (Yadadri Lakshmi Narasimha swamy) విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు..
Yadadri Temple: తెలంగాణ(Telanagana) సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి (Lakshmi Narasimha swamy) విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాదాద్రీశుడి ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి తమ వంతుగా రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ వంతుగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి యాదాద్రీశుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి ఇప్పటికే కిలో బంగారం ఇచ్చామని.. మరో విడతగా ఇంకో కిలో బంగారం సమర్పిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమని చెప్పారు. తెలంగాణాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లుతోందన్నారు హరీష్ రావు. ప్రధానాలయ ఉద్ఘాటన మార్చి నెలలో చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి హైద్రాబాద్ కు వచ్చే పర్యాటకులతో యాదాద్రి ఆలయం.. ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రంగా విరాజిల్లనుందని .. దీంతో యాదాద్రి చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మా దృష్టికి తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసువెళ్తానని చెప్పారు.
యాదాద్రీశుడి ఆలయ గోపురానికి బంగారం తాపడం చేయించాలని తలపెట్టిన పనుల కోసం రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే సీఎంతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు బంగారం అందజేశారు. తిరుమల తరహాలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నట్లు.. అందుకు 125 కిలోల బంగారం అవసరమవుతుందని సీఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: