Seethakka: శ్రీశైలంలో మంత్రి సీతక్క.. ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ మంత్రి సీతక్క దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 01, 2024 | 1:07 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ మంత్రి సీతక్క దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి దర్శనార్ధం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు ఆలయ పీఆర్‌ఓ శ్రీనివాసులు అర్చకులు వేదపండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి అమ్మవారి జ్ఞాపికను అందజేయగా అర్చకస్వాములు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్ధప్రసాదాలను అందించారు. కార్తీకమాసం ముగియడంతో నేడు అమావాస్య గడియాలు రావడంతో మంత్రి సీతక్క శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమె వెంట అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీశైలం టీడీపీ నాయకులు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి