వాగులో తేలిన పొట్టేలు కళేబరం.. నిమ్మకాయలు, మట్టిబొమ్మ, విస్తరి భోజనం.. బిక్కుబిక్కుమంటున్న జనం!

ఇటీవల వరసగా మహాదేవపూర్ మండలంలో క్షుద్ర పూజలు హడలెత్తిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వాగులో తేలిన పొట్టేలు కళేబరం.. నిమ్మకాయలు, మట్టిబొమ్మ, విస్తరి భోజనం.. బిక్కుబిక్కుమంటున్న జనం!
Black Magic
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 01, 2024 | 4:30 PM

చీకటి పడితే చాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం తీర ప్రాంతం మహాదేవపూర్ మండలం ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా క్షుద్ర పూజలు జరుగుతుండడం చర్చనీయాంశమైంది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, కోడి, మేక అవశేషాలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఓ మేకను చంపి తినేయ్యడంతో నిజంగానే ఆగంతకులు తిరుగుతున్నాడనే ప్రచారం జోరందుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పరిసర గ్రామాల్లో వరస క్షుద్రపూజలు ఇక్కడి ప్రజలను హడలెత్తి పోయేలా చేస్తున్నాయి. గత కొద్ది రోజుల నుండి జంతువులను బలిచ్చి రక్తార్పనంతో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, శత్రుసంహారం, గుప్తనిధుల కోసం ఈ విధంగా అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో పోలీసుల హెచ్చరించినా ఈ క్షుద్ర పూజలు మాత్రం ఆగడం లేదు..!

తాజాగా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్థరాత్రి వేళ వాగు పరిసరాల్లో క్షుద్రపూజలు నిర్వహించిన అనవాళ్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. గుర్తు తెలియని వ్యక్తులు మేక పొట్టేలును బలిచ్చారు. అన్నం, నిమ్మకాయలు, పసుపు కుంకుమతో పూజలు చేసిన అనవాళ్లు దర్శనమిచ్చాయి. క్షుద్రపూజలు నిర్వహించిన దుండగులు వారు బలిచ్చిన పొట్టేలు కళేబరాన్ని వాగులో వదిలేశారు. వాగులో క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ఇటీవల వరసగా మహాదేవపూర్ మండలంలో క్షుద్ర పూజలు హడలెత్తిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని వారిని బైండోవర్ చేశారు. ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా క్షుద్ర పూజలు మాత్రం ఆగడం లేదు. అనారోగ్య సమస్యలు, గుప్త నిధులు, వ్యక్తిగత కక్ష్య సాధింపు కోసం ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అమాయక ప్రజలను క్షుద్రపూజల పేరుతో మోసం చేసి డబ్బులు గుంజుతూ, భయాందోళనలకు గురిచేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..