Telangana: సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు.. కులగణనపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొన్నం

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సర్వేకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana: సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు.. కులగణనపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar On Caste Census
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 06, 2024 | 5:06 PM

రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నవంబర్ 6 నుండి  30 వరకు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే  దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఈ  సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు  కుల సర్వేను బుధవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్‌లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని తెలిపారు. సర్వే నిర్వహణకు 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ జీవో విడుదల చేశామని, ప్రభుత్వం సర్వేకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 30వ తేదీ వరకు సర్వే  జరుగుతుందని, ముందుగా ఎన్యుమరేటర్ బ్లాక్‌‌గా గుర్తించిన మ్యాప్ ప్రకారంగా ఇళ్లను సర్వే చేసి స్టికర్ వేసి ఇంటి యజమానులకు సమగ్ర కుటుంబ సర్వేపై సమాచారం ఇచ్చి, 9వ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సమగ్ర వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. సర్వే పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 1,17, 44,00 కోట్ల ఇండ్లు సర్వే చేయడానికి 88 వేల  ఎన్యూమరేటర్లను నియమించినట్లు చెప్పారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇండ్లు కేటాయించారని, కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే అని  తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారంతో  భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వేతో ఎవరికీ అన్యాయం జరగదని, ఇబ్బందులు కలగవని, ఈ సర్వే  భవిష్యత్తులో అందరికీ న్యాయం జరిగే విధంగా దోహదపడుతుందన్నారు. ఈ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి కాబోతుందన్నారు. సుహృద్భావ వాతావరణంలో సర్వే జరగాలని, అందుకు తెలంగాణ యావత్ సమాజం, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు,  ప్రతి పక్ష నాయకులు సహృదయంతో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

ప్రజలను భ్రమ పెట్టి, భయపెట్టే విధంగా ప్రవర్తించకూడదని, అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ  కార్యక్రమానికి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారు  సహకరించాలని కోరారు. సమాచార సేకరణ అధికారికి పూర్తిగా సహకరించి సమగ్ర సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 29,58,277 ఇండ్ల సర్వేకు 20,920 మంది ఎన్యూమరేటర్లను, 1728 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు తెలిపారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!