Minister Malla Reddy: మల్లారెడ్డి కుమారుడికి ఛాతిలో నొప్పి.. ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదం..

తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రంతా మొత్తం 46 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Minister Malla Reddy: మల్లారెడ్డి కుమారుడికి ఛాతిలో నొప్పి.. ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదం..
It Raids On Malla Reddy
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Nov 23, 2022 | 11:18 AM

తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రంతా మొత్తం 46 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాత్రి డాక్యుమెంట్ లతో సహా సంతోష్ రెడ్డిని తీసుకుని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు ఐటీ అధికారులు. మరికొన్ని చోట్ల రాత్రి సోదాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. సోదాలు నిలిపివేసిన చోట్ల Crpf భద్రత ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి తిరిగి ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. నారాయణ హృదయాలయలో మహేందర్‌రెడ్డికి చికిత్స కొనసాగుతోంది.

ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఐటీ అధికారులు అడ్డుకోగా.. మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. కుమారుడికి అస్వస్థతగా ఉందని తెలిసి ఆస్పత్రికి వెళుతున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ కక్షేనంటూ మల్లారెడ్డి తెలిపారు. తన కుమారుడిని ఐటీ అధికారులు వేధించారని.. అందుకే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తమను వేధిస్తున్నారని.. తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదంటూ మల్లారెడ్డి తెలిపారు.

నాన్‌స్టాప్‌ ఐటీ తనిఖీలతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2 రోజుల ముందే మల్లారెడ్డి టార్గెంట్‌గా ఐటీ అధికారుల రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల్లా మల్లారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు చేశారని.. భూమి కొనుగోలుకు బ్లాక్‌మనీ ఇచ్చినా పర్లేదంటూ ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. మల్లారెడ్డికి తెలిసిన బ్రోకర్‌ ద్వారా డీల్‌కి వెళ్లి అన్నీ ఆరా..! తీసినట్లు పేర్కొంటున్నారు.  6 నెలలుగా మల్లారెడ్డి, బంధువులు, సంస్థల డైరెక్టర్ల అకౌంట్లపై నిఘా ఉంచారని.. 300 బ్యాంక్ అకౌంట్లను ఐటీ అధికారులు స్టడీ చేసినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!