Uttar Pradesh: ఎక్స్‌ప్రెస్ వే పక్కన రెడ్ కలర్ సూట్‌కేస్.. అనుమానంతో ఓపెన్ చేసి చూడగా షాక్..!
ఉత్తరప్రదేశ్ మథురలోని థానా రాయ ప్రాంతంలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యువతి మృతదేహం లభ్యమైంది. రెడ్ కలర్ బ్యాగ్ లో ఉన్న డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ మథురలోని థానా రాయ ప్రాంతంలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యువతి మృతదేహం లభ్యమైంది. రెడ్ కలర్ బ్యాగ్ లో ఉన్న డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాధితురాలు ఎవరనేది ఇంకా నిర్థారణ కాలేదు. కాగా యువతి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని కేసుగా నమోదు చేసుకున్నారు. మృతురాలి వయస్సు 22 సంవత్సరాలు ఉంటుందని రాయ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఓంహారీ వాజ్‌పేయి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మృతురాలి ఛాతీలో తుపాకీతో కాల్చి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. శరీరంపై చాలా చోట్ల గాయాల గుర్తులు కనిపించాయి. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కూడా యువతి ఫొటోను పంపించారు. యువతిని హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి ఇక్కడే పడేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. యువతిని గుర్తించేందుకు, హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఎస్పీ దేహత్ త్రిగుణ్ బిసెన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..