Plane Crash: రన్‌వేపై విమాన ప్రమాదం.. పైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. ఎక్సక్లూసివ్ వీడియో..
పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి చెందారు.
పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి చెందారు. మరో ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. కాగా విమాన సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బస్ ఎ 320 నియో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించామని అధికారులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు పెడ్రో సంతాపం తెలిపారు. విమానం లిమా నుంచి పెరువియన్ నగరమైన జూలియాకాకు వెళుతుండగా రన్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనంతరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..