AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కవితకు ఈడీ సమన్లపై తొలిసారి స్పందించిన కేటీఆర్‌.. మోదీపై సంచలన ఆరోపణలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..

Shiva Prajapati
| Edited By: |

Updated on: Mar 09, 2023 | 3:29 PM

Share

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌లో 11 మంది నేతలపై దాడులు చేశారని అన్నారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోదీ సమన్లు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి- జనాలపై ధరల దాడి చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం అని తీవ్ర విమర్శలు చేశారు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. ముంద్రా పోర్టులో రూ. 21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. బీజేపీలో ఎవరు చేరినా కేసులు ఉండవని విమర్శించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితోనే అదానీకి ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందని, దానిపై చర్యలేవని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వస్తాయని, మీడియాను సైతం వదలరని విమర్శించారు మంత్రి. అదానీతో ఒప్పందం అంటే.. గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్‌ అన్నట్లే అని శ్రీలంక ప్రతినిథి చెప్పడాని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు మంత్రి కేటీఆర్. ఆ అభియోగాలపై కేసులు ఉండవు, ప్రధాని వివరణ ఇవ్వరని విమర్శించారుర. 2014 తర్వాత 95శాతం ఈడీ దాడులు విపక్షాలపైనే జరిగాయని, భారీ అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ చెప్పిన స్కామ్స్..

1. గుజరాత్‌లో నిషేధం ఉన్నా లిక్కర్ తాగి 21మంది చనిపోవడం పెద్ద స్కామ్. 2. అదానీ నుంచే బొగ్గు కొనాలని పాలసీ చెయ్యడం మరోస్కామ్. 3. రెండు ఎయిర్‌పోర్ట్‌ల నిబంధన కాదని ఆరుఎయిర్‌పోర్టులు ఆదానికి ఇవ్వడం స్కామ్. 4. అదానీ పోర్టుల్లో డ్రగ్స్ దొరికినా విచారణ లేకపోవడం పెద్ద స్కామ్. 5. కృష్ణపట్నం, గంగవరం, ముంబై ఎయిర్‌పోర్ట్‌లు బెదిరించి లాక్కోవడం పెద్ద స్కామ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..