KTR on Budget: తెలంగాణ పట్ల కేంద్ర విపక్ష చూపుతోంది.. కొత్త బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదుః కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు.

KTR on Budget: తెలంగాణ పట్ల కేంద్ర విపక్ష చూపుతోంది.. కొత్త బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదుః కేటీఆర్
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 02, 2022 | 4:36 PM

Minister KTR Criticise on Union Budget 2022: కేంద్ర ప్రభుత్వం(Union Government) తెలంగాణ(Telangana)పై వివక్షత చూపుతోందని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు(Minister KTR) అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారని, ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు ఉపయోగ పడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని, మెట్రో రైలు కు నిధులు అడిగామని ఆయన వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథకు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి చేయూతను ఇవ్వాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరిన ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అంశాల విషయంలో తగినంత నిధులు ఇవ్వడంలో కేంద్రం మరోసారి మొండి చేయి చూపిందన్నారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఇకనైనా ఈ సవతి తల్లి ప్రేమను విడనాడాలని రాష్ట్రం అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కేంద్రం సహాయం చేయాలన్నారు. అయితే కేంద్రం బడ్జెట్ లో మా రాష్ట్రానికి తగిన నిధులను ఇవ్వకపోయినా మా ప్రభుత్వం అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తగ్గేది లేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

Read Also…. Sajjala on AP PRC: ప్రజలకు ఇబ్బంది కలగిస్తే చర్యలు తప్పవన్న సజ్జల.. సమ్మెలో లేమన్న ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!