AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drug Case: హైకోర్టులో ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈడీ అడుగుతున్న పత్రాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు..

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood Drug Case)పై హైకోర్టు(High Court) నేడు విచారించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ ..

Tollywood Drug Case: హైకోర్టులో ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈడీ అడుగుతున్న పత్రాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు..
Hyderabad Drugs Case
Surya Kala
|

Updated on: Feb 02, 2022 | 4:22 PM

Share

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood Drug Case)పై హైకోర్టు(High Court) నేడు విచారించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ  జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరపున న్యాయవాది రచనరెడ్డి తన వాదనలు వినిపించారు. అంతేకాదు ఈ డ్రగ్ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని.. అయినప్పటికీ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదంటూ రచనారెడ్డి ఆరోపించారు. ఆన్ లైన్ విచారణలో నేరుగా కోర్టుకు వివరించిన ఈడీ జేడీ అభిషేక్ గోయెల్.. డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పారు. ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టు చెబుతోందని జేడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అయితే తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ చెప్పారు. ఎఫ్ఐఆర్ లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశించిన హైకోర్టు.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని తెలిపింది.

డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై విచారణ ముగించిన హైకోర్టు.. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం  లేదని హైకోర్టు పేర్కొంది. అంతేకాదు తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటికీ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించకపోతే తమను మళ్ళీ  సంప్రదించవచ్చునని ఈడీకి హైకోర్టు సూచన చేసింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించిన హైకోర్టు.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈడీ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తెలిపింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణ ముగించింది.

Also Read :

 ప్రజలకు ఇబ్బంది కలగిస్తే చర్యలు తప్పవన్న సజ్జల.. సమ్మెలో లేమన్న ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం!