ఘనంగా మొదలైన శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు.. ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించనున్న ప్రధాని మోడీ

సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ సమీపం ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి.

ఘనంగా మొదలైన శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు.. ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించనున్న ప్రధాని మోడీ
Modi,statue Of Equality
Follow us

|

Updated on: Feb 02, 2022 | 8:22 PM

Sri Ramanuja millennium celebrations: సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలతో హైదరాబాద్(Hyderabad) శివారులోని శంషాబాద్‌ సమీపం ముచ్చింతల్(Muchinthal) దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి(Sri Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా మొదలుపెట్టిన విశ్వక్ సేనుడి పూజ, వాస్తు శాంతి పూజ విజయవంతంగా జరిగింది. సమతామూర్తి విగ్రహా ప్రతిష్ట(Statue of Equality) కార్యక్రమంలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సహా మంత్రులు తదితరులు హాజరుకానున్నారు.

ఇదిలావుంటే సమతామూర్తి స్ఫూర్తి.. ఎల్లలుదాటిన కీర్తి..! దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం. అంకురార్పణతో సహస్రాబ్ది సమారోహాన ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోదీ ముచ్చింతల్ పర్యటన ఖరారైంది. ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం ముచ్చింతల్‌లోని ఆశ్రమాన్ని సందర్శించింది SPG టీమ్. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ అధికారులు, కమాండోలు ఆశ్రమంలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రధాని మోడీ విజిట్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఎక్కడ దిగాలి? ఎంత దూరం నడవాలి? ఆశ్రమంలో ఏయే ప్రాంతాలను సందర్శించాలి? తిరిగి ఎపుడు రిటర్న్ కావాలన్న వివరాలను తీసుకుంది సెక్యూరిటీ వింగ్. భద్రతాధికారులకు ఏర్పాట్లను వివరించారు చినజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావు. సెక్యూరిటీ పరంగా చిన్నపాటి సూచనలు చేశారు అధికారులు. వీటిని పరిగణలోకి తీసుకున్నామని, ఆ మేరకు మార్పుల చేస్తామని చినజీయర్ స్వామి తెలిపారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు, పండితులు, పామరులు వస్తుండటంతో.. ముచ్చింతల్‌లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సుమారు 7వేల మంది పోలీసులు బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. అటు పటిష్టమైన ఆక్టోపస్ కమాండో భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతిరోజు 30 మంది సాయుధులైన కమాండోలు 24 గంటలు నిరంతర పహారాలో ఉంటారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సహస్రాబ్ది వేడుకలకు దేశంలోని పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. ప్రధాని పర్యటన ముగిసిన రెండు రోజులకు అంటే ఈ నెల 7న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, 8న హోంమంత్రి అమిత్‌ షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్నారు. ప్రధానాలయంలోని నిత్య పూజామూర్తి బంగారు విగ్రహానికి తొలిపూజ చేస్తారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు ముచ్చింతల్‌కు తరలిరానున్నారు.